Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

రైలు డీకొని గుర్తు తెలియని మహిళ మృతి…

train-acedent

మంచిర్యాల సిటీ: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు  రైలు డీకొట్టడంతో గుర్తు తెలియని మహిళ (75)అక్కడికక్కడే మృతి చెందిందని మంచిర్యాల జిఆర్‌పి పోలీసులు తెలిపారు. ఆదివారం రామగుండం వైపు ప్రయానిస్తున్న గుర్తు తెలియని రైలు డీకొట్టి ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా మహిళా శవం గుర్తు పట్టడానికి వీలు లేకుండా ముక్కలు ముక్కలుగా పడిందన్నారు .మృతురాలి వద్ద ఎలాంటి ఆనవాలు లభించలేదని వారు తెలిపారు. మృతురాలి ఒంటిపై బ్లూకలర్ చుక్కలు గల చీర, ఆకు పచ్చని జాకెట్ ఉన్నాయన్నారు. వివరాలు తెలిసిన వారు. రైల్వే పోలీస్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

Comments

comments