Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

అపూర్వ ఘట్టానికి ఆవిష్కృతం..

crane3* నిరంజన్‌రెడ్డి కృషితో..
నెరవేరిన పెద్దమందడి మండల
రైతుల ఆకాంక్ష..
* బీడువారిన పొలాల్లో ….
ఇక సిరుల పంట..
* బుద్దారం చెరువు నుండి పెద్దమందడి
బ్రాంచ్ కెనాల్‌కు.. ట్రయల్ రన్‌తో
నీటి విడుదల ..
* నేడు మంత్రి హరీశ్‌రావు చేతుల
మీదుగా నీటి విడుదలకు శ్రీకారం…

మన తెలంగాణ/పెద్దమందడి: తెలంగాణ వస్తే ఏమొస్తదన్న దానికి ని దర్శనం కళ్లముందు కన్పించే అభివృద్ధి ఫలాలే ప్రత్యేక నిదర్శనం. వనపర్తి జిల్లా పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ నిర్మాణంతో తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష తీరినట్లైంది. రైతుల బతుకుదెరువుకు చెర్వులే జీవనాడులు. అన్న సంకల్పంతో దశాబ్దాలుగా ఎండిన చెర్వులను సాగునీటితో నింపా లన్న లక్షంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరం జన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఒక ఖిల్లా ఘణపురం గణప సము ద్రం అయిన పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ నిర్మాణమైన వనపర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. నిరంజన్‌రెడ్డి కృషితో రెండు ప్రాజెక్టు లు కూడా ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే పూర్తి చేసి రైతుల పొలాలకు సాగునీరందింస్తున్న చరిత్ర మరిచిపోలేనిది. పెద్దమందడి మండలానికి మంచి రోజులు వచ్చాయి. ఈఏడాది జనవరి 29న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన పెద్దమం దడి బ్రాంచ్ కెనాల్ పనులు కేవలం 50 రోజుల్లోనే నిరంజన్‌రెడ్డి పట్టు దల స్వంత మండలానికి సాగునీరు ఇవ్వాలన్నా ఆకాంక్షతో ఏజెన్సీ నిర్వాహకులు మేఘారెడ్డి పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేశారు. 4.2 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయింది. జం గమాయపల్లి బలిజపల్లి ఈర్లచెరువుకు బుద్దారం చెర్వు నుండి గురువా రం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హారీష్‌రావు, నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా పెద్దమం దడి బ్రాంచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈర్ల చెర్వు దగ్గర ప్రత్యేక పూజల అనంత రం అక్కడే 15 వేల మంది రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈసభలో మంత్రి హరీష్‌రావు రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈర్లచెరువు నిండిన వెంటనే పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి, వీరాయపల్లి, పెద్దమందడి, అల్వాల, చిన్నమందడి, మద్దిగట్ల, అమ్మపల్లి, మోజ ర్ల, వెల్టూర్, చెరువులకు గొలుసుకట్టు ద్వారా ఈ నెల 15 తేదీలోపు చెర్వులన్నీ నిండనున్నాయి. ఇన్నాళ్లు బీడువారి కంపచెట్లు, మురికితుమ్మలు మొలచిన రైతుల బీడు భూముల్లో ఇక నుండి సిరుల పంటలు పండనున్నాయి. రైతులు ఆర్థికంగా ,సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించనున్నారు. పెద్దమందడి మండలం ఇక నుండి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలను తలపించనుంది. బుధవారం భారీ నీటి పారుదల శాఖా ఈఈ రాంచందర్ ,ఏజెన్సీ కాంట్రాక్టర్, బుద్దారం చెర్వు నుండి పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌కు లాంఛనంగా ట్రయల్ రన్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. గురువారం ఉదయానికల్లా ఈర్లచెర్వులోకి నీరు ప్రవేశిం చనుంది. టిఆర్‌ఎస్ బహిరంగ సభకు భారీగా జనాన్ని,రైతులను తరలించేందుకు మండల నాయకులు అన్ని ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు.

Comments

comments