Home తాజా వార్తలు అమిత్ షా జోస్యం నిజమైంది… అఖిలేష్ రాజీనామా

అమిత్ షా జోస్యం నిజమైంది… అఖిలేష్ రాజీనామా

Akhilesh-and-Amit-Shah

లక్నో: యుపి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. యుపి ఎన్నికల సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… “ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం ఖాయమని, సిఎం అఖిలేష్ యాదవ్ తన రాజీనామా పత్రాలను సిద్ధం చేసుకోవాలి. మార్చి 11 మధ్యాహ్నం 1 గంటకల్లా రాజీనామా సమర్పించాలన్నారు”. అచ్చం అలాగే శనివారం వెలువడిన ఫలితాల్లో అధికార సమాజ్ వాదీ పార్టీ భంగపడింది.

ఆయన జోస్యాన్ని నిజం చేస్తూ ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలేష్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌కి వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించనున్నాడు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు మించి బిజెపి ప్రస్తుతం 309 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సమాజ్‌వాది-కాంగ్రెస్ కూటమి 65 స్థానాలకే పరిమితమైంది. బిఎస్‌పికి కేవలం 21 స్థానాలు దక్కాయి.