Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వందేమాతరం పాడకపోవడం దురుద్దేశపూరితమే

YOGI-1

లక్నో: యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ జాతీయగేయం వందేమాతరంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదంగా మారాయి. వందేమాతరం పాడకపోవడం తీవ్రమైన విషయమని, దీనిని త్రీవంగా పరిగణించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. అంతేగాక ఈ విషయంలో దురుద్దేశపూరితంగా వ్యవహరించేవారిని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై దృష్టిసారించాలన్నారు. కొందరు వ్యక్తులు వందేమాతరం పాడబోమని పేర్కొనడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

యుపిలోని మున్సిపాలిటీలలో వందేమాతరం పాడటంపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మీరట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సమావేశంతో పాటు అలహాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సమావేశంలో వందేమాతరం పాడకపోవడం వివాదంగా మారింది. దీంతో బిజెపి వందేమాతరం గేయం పాడటాన్ని తప్పనిసరి చేయాలంటూ తీర్మానం పెట్టగా, సమాజ్ వాదీతో పాటు ఇతర పార్టీలు వ్యతిరేకించడం గమనార్హం.

Comments

comments