Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

యూపీ అభివృద్ధి బిజెపితోనే : మోడీ

 

PM-NARENDRA

లక్నో : యూపీలో కమలమే వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బిజ్నోర్‌లో జరిగిన ఎన్కిల ప్రచార బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరై ప్రసంగించారు. పేద, దళిత వర్గాల సంక్షేమం కోసం బిజెపికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, ఎస్‌పి పాలనలో యూపీలో అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. సమాజ్‌వాదీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. సామూహిక అత్యాచారాలపై ఎస్‌పి నేతల వ్యాఖ్యలు సిగ్గు చేటుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. యూపీ అభివృద్ధి, మహిళల రక్షణ కోసం బిజెపినే ఎన్నుకోవాలని ఆయన యూపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

Comments

comments