Home ఆఫ్ బీట్ తెగిన రోగి కాలును దిండుగా వాడిన వైద్యులు!

తెగిన రోగి కాలును దిండుగా వాడిన వైద్యులు!

Patient

లక్నో: మానవత్వం మచ్చుకైన కనిపించని దారుణ ఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ లారీ క్లీనర్ కాలు తొలిగించారు అక్కడి వైద్యులు. అనంతరం అతడిని అత్యవసర వార్డుకు తరలించాల్సి వచ్చింది. అయితే రోగి విశ్రాంతి తీసుకోవడానికి దిండు లేకపోవడంతో అతని కాలునే తలగడగా వాడారు. ఈ విషయాన్ని బాధితుడితో పాటు వచ్చిన మరో వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ అమానవీయ ఘటన యుపిలోని మహరాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపాల్ సాధనా కౌశిక్ వెంటనే స్పందించారు. క్రమశిక్షణ చర్యల కింద ఆర్థోపెడిక్ వైద్యుడితో పాటు ఇన్‌ఛార్జ్ నర్సులను తొలగించారు. ఈ చర్యకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

UP Doctors Use Man’s Severed Foot As Headrest After His Surgery.