Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఫిర్యాదు కోసం పిజ్జా..!

UP Policewoman Demands Free Pizza, Chilly Chicken For Registering FIR

లక్నో: ఇటివలి కాలంలో చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు తమతమ స్థాయిలను బట్టి ఎంతో కొంత లంచం డిమాండ్ చేస్తుండటం సర్వ సాధారణమైపోయింది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే పైసా లేనిదే ఫైళ్లు ముందుకు కదలవనే భావనకు వచ్చేశారు ప్రజలు. లంచం అనగానే పెద్ద మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులను డిమాండ్ చేయడం కామన్. అయితే యుపిలో ఓ మహిళా ఎస్‌ఐ అడిగిన లంచం ఎంటో తెలిస్తే అవాకవ్వాల్సిందే. ఓ వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు పిఎస్‌కువెళ్లాడు. అయితే బాధితుడికి అక్కడ వింత అనుభవం ఎదురైంది.

బాధితుడు రెస్టారెంట్ ఓనర్ అని తెలుసుకున్న మహిళా ఎస్‌ఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటే పిజ్జా, చిల్లీ చికెన్ కావాలని చెప్పింది. ఆ అధికారిణి వింత డిమాండ్‌కు కంగుతిన్న బాధితుడు వెంటనే పిజ్జా, చిల్లీ చికెన్ తీసుకువచ్చాడు. అయితే విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో విచారణ చేపట్టిన అధికారులకు ఎస్ సుమిత్రా దేవి బాధితుడి వద్ద పిజ్జా లంచంగా డిమాండ్ చేసిన విషయం నిజమని తేలింది. దాంతో ఆమెపై వేటు వేశారు. అలాగే పోలీసు అధికారులు బాధితుడైన రెస్టారెంట్ ఓనర్‌కు పిజ్జా, చిల్లీచికెన్‌కు సుమారు రూ. 7000 చెల్లించారు.  ఫిర్యాదు స్వీకరించడానికి  మహిళా ఎస్‌ఐ చేసిన వింత  డిమాండ్‌ చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Comments

comments