Search
Sunday 22 July 2018
  • :
  • :

ఉపాధి హామీ కూలీ డబ్బుల కోసం ధర్నా

Upadhi Hami Workers Dharna for wage money

వలిగొండః గత ఆరు నెలల నుండి ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పని చేస్తున్న నెమిలకాల్వ గ్రామానికి చెందిన వారికి రావలసిన బకాయిలు 6,36,621 రూపాయలను చెల్లించాలని నాగారం గ్రామ పోస్ట్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి, వలిగొండ ఎంపిడీవో కార్యాలయం వరకు ర్యాలీని,పాదయాత్రను నిర్వహించారు. అనంతరం డిఆర్‌డిఏ పిడికి శనివారం వినతి పత్రం అందజేశారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు వేముల మహేందర్ మాట్లాడుతూ నెలల తరబడి పనులు చేస్తున్న నెమిలకాల్వ కూలీలకు కూలీ డబ్బులను చెల్లించక పోవడం దారుమని వెంటనే కూలీ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో టిమాస చైర్మన్ చాట్ల పాండు,టౌన్కా ర్యదర్శి కూర శ్రీనివాస్,మొర్రి అలివేలు,వంగాల అంజమ్మ,ధనమ్మ,సంతోష,చంద్రయ్య,అంజయ్య,బిక్షపతి,బందెల లాలయ్య,అండాలు,లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments