Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

వచ్చే వారమే కొత్త చిత్రం ప్రారంభం

Upcoming Movies of Allu Arjun in 2018

అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య…’ వచ్చి మూడు నెలలు అవుతోంది. ఆతర్వాత బన్నీ ఇప్పటివరకు కొత్త సినిమాను ప్రారంభించలేదు. దీంతో అభిమానులు అతని  కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరికి అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభోత్సవం వచ్చే వారమే ఉంటుందని తెలిసింది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ముందుగా అనుకున్న స్క్రిప్ట్‌కి కొన్ని మార్పులు చేసి అల్లుఅర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టు స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఇక ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. అదే నిజమైతే తొలిసారిగా ఈ స్టార్ హీరో డ్యూయల్ రోల్  చేసిన చిత్రమిదే అవుతుంది. అంతేకాదు తక్కువ గ్యాప్‌లోనే అల్లుఅర్జున్ నటించబోయే మరో చిత్రాన్ని కూడా ప్రకటించబోతున్నట్టు తెలిసింది. గతంలో ప్రకటించిన లింగుస్వామి సినిమానా లేదా మరో చిత్రమా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ‘నా పేరు సూర్య’ పోస్ట్‌ప్రొడక్షన్ సమయం నుంచి లెక్కబెట్టుకుంటే నాలుగు నెలల విరామం తర్వాత అల్లుఅర్జున్ సెట్స్‌పైకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక  టిపికల్ స్క్రీన్‌ప్లేతో నడిపిస్తూనే అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు విక్రమ్ కుమార్ జాగ్రత్తపడినట్టు తెలిసింది.

Comments

comments