Home నాగర్ కర్నూల్ నల్లమలలో యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు చేయ్యాలి

నల్లమలలో యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు చేయ్యాలి

ప్రభుత్వం పోడు భూములకు పట్టాలివ్వాలి,
లేదంటే త్వరలో అసెంబ్లీ ముట్టడిస్తాం
సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్

Chada

అమ్రాబాద్: నల్లమలలో యురేనియం ఖనిజ నిక్షేపాల  తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట వీశాఖ వారి అధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ బోర్డు పేరి ట అనుమతులు ఇచ్చారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో యురేనియం తవ్వ కాల అనుమతులకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు ఆదివాసులకు వ్యతిరేకంగా పనిచే స్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఆదివాసులు చెంచులు ఇన్న చోట యురేని యం పేరట అమాయకులను బలిదీసుకోవాలని భౌళ జాతీ సంస్థలకు అమ్ముకుం టున్నారని  తెలియజేశారు.అందులోబాగంగానే  నల్ల మలలో యురేనియం తవ్వ కాల పేరట అనుమతులు ఇవ్వటం అని అన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను తెలంగాణ ప్రభుత్వం బలవం తంగా లాక్కొని ఆ పోలాల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటించారని మండిప డ్డారు.ముఖ్య మంత్రి కెసిఆర్‌కు దళితలన్న,పేదల ఆయనకు ఇష్టంలేదని దళితులకు మూడెకరాల భూమి మాటలకు మాత్రమే పరిమితం అయిందన్నారు.పేదలకు డబుల్ బెడ్‌రూం ఇస్తానని చెప్పి మోసం చేశారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ,అచ్చంపేట  ఎంఎల్‌ఎ డాక్టర్ వంశీకృష్ణ,ప్రజా మిత్ర చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు నాసరయ్య,సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్‌నర్సిహ్మా తదితరులు పాల్గొన్నారు.