Home తాజా వార్తలు ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ ట్రైలర్ చూశారా..?

‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ ట్రైలర్ చూశారా..?

URI Movieముంబయి: 2016 లో జమ్ముకశ్మీర్ యురి సెక్టార్‌ లోని ఆర్మీ స్థావరంపై టెర్ర‌రిస్ట్‌లు ఎటాక్ చేసిన సంఘ‌ట‌న ఎంత పెద్ద సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాగా, యురి దాడికి వ్య‌తిరేఖంగా భారత ఆర్మీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స‌ర్జికల్ స్ట్రైక్ నేప‌థ్యంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య దార్ ‘యురి’ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ‘యురి‘ ఆఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో అప్పటి సంఘటనను కళ్లకుకట్టినట్లు చూపించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న యామీ గౌత‌మ్ హీరోియిన్ గా న‌టిస్తుంది. మూవీలో విక్కీ కౌశ‌ల్‌… పాకిస్థాన్ టెర్ర‌రిస్టులపై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేసే టీం క‌మాండ‌ర్ చీఫ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. జనవరి 11వ తేదీన మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

URI Official Trailer is Released