Search
Wednesday 26 September 2018
  • :
  • :

రక్షణ భాగస్వామ్యంలో భారత్‌తో మరింత బంధం

int

716  బిలియన్ డాలర్ల  బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం

పాకిస్తాన్‌కు సాయం కుదింపు 

వాషింగ్టన్ : రక్షణ రంగంలో భారత్‌తో చేసుకున్న ఒప్పందం మరింత బలపడటానికి అమెరికా కాంగ్రెస్ 716 బిలియన్ డాలర్ల బిల్లుకు ఆమోదం తెలిపింది. 2016లో ఒబామా అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించిన కాలంలో, రక్షణ రంగంలో అమెరికాతో భాగస్వామ్యం కలిగిన ఒక ముఖ్యమైన దేశంగా భారత్ వ్యవహరించింది. ఒబామా కాలంలో అనుసరించిన భాగస్వామ్య విధానాన్నే ట్రంప్ ప్రభుత్వం కొనసాగించాలనుకుంటోంది. రక్షణ రంగంలో భారతదేశంతో కలిగిన భాగసామ్యం మరింత బలపడటానికి నేషనల్ డిఫెన్స్ అథారిటీ యాక్ట్ (ఎన్‌డిఎఎ) ప్రకారం 2019 వ సంవత్సరానికి వర్తించే బిల్లుకి అమెరికా కాంగ్రెస్‌లో 87 మంది అనుకూలంగా ఓటు వేశారు. అయితే ఈ ప్రతిపాదిత బిల్లుని 10 మంది వ్యతిరేకించారు. గత వారమే అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుని అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం కోసం వైట్‌హౌజ్‌కు పంపారు. దీనిపై అధ్యక్షుడు సంతకం చేసిన తరువాత అది చట్టరూపం దాల్చుతుంది. అమెరికా హౌజ్‌తో పాటు సెనేట్‌ల ఉమ్మడి సమావేశంలో భారత్‌తో మరింత రక్షణ భాగస్వామ్యం పెంపొందించుకోవాలని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇది వ్యూహాత్మకంగా, ఆచరించదగిన, ఎత్తుగడల భాగస్వామ్యమని సమావేశం అభిప్రాయపడింది. రెండు దేశాల మిలటరీల మధ్య సమన్వయం బలపడాలని అమెరికా కోరుకుంటోందని ఉమ్మడి సమావేశం రిపోర్టు తెలిపింది. రెండు దేశాలు ఒకరికొకరు సహకరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇండియాతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలతో చర్చించాల్సిన అవసరముందని, ఈ ప్రాంతాల్లో భద్రతని కల్పించడంలో సహకరించుకోవాలని తెలిపింది. ఇది ఆయా దేశాల ఉమ్మడి అవసరమని ఆ రిపోర్టు సూచింంచిది. రక్షణ భాగస్వామ్యదేశాల్లో భారత్‌కు ప్రధాన భాగస్వామ్యదేశంగా హోదా కలిగించాలని ట్రంప్‌ని బిల్లు కోరింది. అంతర్గత మిలటరీ సహకారం, వ్యూహాత్మకమైన చర్యలు భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని బిల్లులో అభిప్రాయపడ్డారు.
మరోవైపు పాకిస్తాన్‌తో కలిగిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తలు కొనసాగుతున్నా, పాకిస్తాన్ భద్రత కొరకు ఇచ్చే నిధులను 150 మిలియన్ల డాలర్లుకు కుదించారు. గతంలో ప్రతి యేడాది ఒక బిలియన్ డాలర్లు అందించేవారు. లష్కరే తొయిబా కార్యకలాపాల వల్ల పాకిస్తాన్‌కి ఇచ్చే సాయంలో కోత విధించే షరతుని అమెరికా ప్రక్కన పెట్టింది. నేషనల్ డిఫెన్స్ అథారిటీ యాక్ట్ 2019 కి అమెరికా కాంగ్రెస్ 87 మంది ఓట్లతో బిల్లుని ఆమోదించింది. దీనికి వ్యతిరేకంగా 10 మంది మాత్రమే ఓటు వేశారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత వారమే ఈ బిల్లుని ఆమోదించగా , మంగళవారం సెనేట్ ఈ బిల్లుని పాస్ చేసింది. ఈ బిల్లు కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం వైట్‌హౌజ్‌కు పంపించారు. కొలిషన్ సపోర్ట్ ఫండ్ కింది ఈ మొత్తాన్ని పాకిస్తాన్‌కి అందిస్తారని ఒబామా కాలంలో వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పనిచేసిన అనిష్ గోయల్ తెలిపారు.

Comments

comments