Home అంతర్జాతీయ వార్తలు భారీ ఉగ్రదాడికి ఐసిస్ కుట్ర

భారీ ఉగ్రదాడికి ఐసిస్ కుట్ర

USA

వాషింగ్టన్: ఐసిస్ ఉగ్రవాద సంస్థ క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకొని భారీ నరమేధానికి కుట్ర చేస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా రక్షణ శాఖ వివిధ దేశాలను అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇచ్చింది. ప్రధానంగా యూరప్ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో బ్రిటన్, స్పెయిన్, స్వీడన్, రష్యా, ఫిన్లాండ్‌లతో పాటు పవిత్ర నగరంగా భావించే వాటికన్ సిటీ దేశాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఐసిస్ మీడియా వాఫా… ‘క్రిస్మస్ బ్లడ్ సో వెయిట్’ పేరిట విడుదల చేసిన ఓ కొత్త పోస్టర్ కూడా దీనికి బలం చేకూరుస్తోంది. గతేడాది క్రిస్మస్ నాడే జర్మనీలోని బెర్లిన్ లో ఉగ్ర దాడులు జరిగిన ఘటనలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ హెచ్చరికలను అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదని ఎఫ్‌బిఐ మాజీ ఏజెంట్‌ స్టీవ్‌ గోమెజ్‌ చెప్పారు.

US issues Travel Alert for Europe.