Home అంతర్జాతీయ వార్తలు అటార్నీ జనరల్‌పై ట్రంప్ వేటు

అటార్నీ జనరల్‌పై ట్రంప్ వేటు

వారం రోజుల్లో కీలక మార్పులు

US Midterm Elections: Trump Forced out Attorney General

వాషింగ్టన్: మధ్యంతర ఎన్నికల ఫలితాలు తాను ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు వారం రోజుల్లో తన మంత్రివర్గంలో, ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మంత్రివర్గంలో, వైట్‌హౌస్ సీనియర్ అధికార యంత్రాంగంలో మార్పులకు సంబంధించి వారం రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రకటన చేసిన అరగంటకే అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ కోరిక మేరకే తాను పదవినుంచి తప్పుకొంటున్నట్లు జెఫ్ సెషన్స్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నప్పటికీ, గత కొంతకాలంగా ఆయనకు, ట్రంప్‌కు మధ్య సత్సంబంధాలు లేవనే విషయం బహిరంగ రహస్యమే.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తునుంచి తననుదూరంగా పెట్టడానికి ట్రంప్ యత్నిస్తున్నాడంటూ జెఫ్ సెషన్స్ గత కొన్ని నెలలుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన విషయంలో ట్రంప్ అసంతృప్తితో ఉన్నా రు. కాగా జెఫ్ సెషన్స్ స్థ్థానంలో తాత్కాలిక అటార్నీ జనరల్‌గా ట్రంప్‌కు అత్యంత నమ్మకస్థుడైన మాథ్యూ జీ వైట్‌కర్‌ను నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్‌లో తెలిపారు. ట్రంప్ జరపనున్న మార్పుల్లో భాగంగా పదవులు కోల్పోనున్న వారిలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ కూడా ఉండవచ్చని అంటున్నారు. మధ్యతర ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో, పాలనా యం త్రాంగంలో మార్పులు జరగడం సర్వ సాధారణమేనని విలేఖరుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే తన మంత్రివర్గంలోని చాలా మంది బాగా పని చేస్తున్నారంటూ ఆయన కితాబు ఇచ్చారు కూడా. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కూడా కొద్ది రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.

సిఎన్‌ఎన్ రిపోర్టర్ ప్రెస్‌పాస్ రద్దు

కాగా, మధ్యంతర ఎన్నికల్లో కంగుతిన్న ట్రంప్ మరోసారి మీడియాపై తన అక్కసు వెళ్లగక్కారు. మీడియా తప్పుడు ప్రచారమే తమ ఓటమికి కారణమని యాన పరోక్షంగా విమర్శించారు. ఈ క్రమంలో సిఎన్‌ఎన్ సీనియర్ జర్నలిస్టు జిమ్ అకోస్టా వైట్‌హౌస్ ప్రెస్‌పాస్‌ను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. మధ్యతర ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అకోస్టా కూడా హాజరైనారు. ఈ క్రమంలో వలసదారులపై ట్రంప్ ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన ప్రస్తావిసూ,్త ఇది కూడా ఒక రకమైన దాడే కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

దీంతో సహనం కోల్పోయిన ట్రంప్ ‘నిజం చెప్పనా.. అధ్యక్షుడిగా ఏం చేయాలో నాకు తెలు సు. మీరు మీ వార్తాసంస్థను సరిగా నడిపించుకోండి. అలాగే రేటింగ్ పెంచుకోండి’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.ఈక్రమంలో మరో ప్రశ్న అడగడానికి అ కోస్టా సిద్ధమవగా ‘కూర్చో.. ఆయన దగ్గరనుంచి మైక్రోఫోన్ లాక్కోండి’ అంటూ అసహనంగా మాట్లాడారు. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత జిమ్ మరోసారి వైట్‌హౌస్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకొన్నారు. ప్రెస్‌పాస్ రద్దయినందు న మిమ్మల్లిన లోపలికి అనుమతించలేమని వారు స్పష్టం చేశారు.ఈ క్రమంలో భవిష్యత్తు నోటీసు అందేవరకు మళ్లీ వైట్‌హౌస్‌లోకి అనుమతించేదిలేదనిస్పష్టం చేశాయి. కాగా ట్రంప్ చర్యపై సిఎన్‌ఎన్ యాజమాన్యం స్పంది స్తూ, ‘ప్రజాస్వామ్యానికి ప్రమాదం’గా అభివర్ణించింది.