Search
Wednesday 21 November 2018
  • :
  • :

మధ్యంతర ఎన్నికలలో ట్రంప్ కు ఎదురుదెబ్బ

Democratic

వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ విజయదుందుభి మోగించింది. డెమోక్రటిక్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొవడంతో  రిపబ్లికన్ పార్టీ నేత  డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బతగిలింది. అమెరికాలో బుధవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రతినిధుల సభలో ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ మెజార్టీ స్థానాలను గెలుపొందింది. సెనేట్ లో పాలక పక్షం రిపబ్లికన్ పార్టీ తమ ఆధిక్యాన్ని కాపాడుకొని పరువు నిలుపుకుంది. అమెరికాలో ప్రతినిధుల సభ, సెనేట్ ను కలిపితే కాంగ్రెస్ అవుతుంది.  ప్రతినిధుల సభలో 435 స్థానాల్లో 412 ఫలితాలు వెలువడ్డాయి. డెమోక్రాట్లు 219 స్థానాల్లో విజయం సాధించగా, 193 స్థానాల్లో రిపబ్లికన్లు విజయఖేతనం ఎగురవేశారు. మొత్తంగా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అత్యధిక స్థానాలు గెలుపొంది మెజార్టీలో ఉంది. దీంతో ట్రంప్ కు ప్రతినిధుల సభలో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని రాజకీయ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. సెనేట్ లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగగా 31 చోట్ల ఫలితాలను విడుదల చేశారు.  రిజల్ట్స్ వచ్చిన తరువాత సెనేట్ లో 51 మంది రిపబ్లికన్లు, 45 డెమోక్రాట్లు ఉన్నారు. 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు ఎన్నికలు జరుపగా 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. 22 రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయం సాధించగా, 25 స్థానాల్లో రిపబ్లికన్లు గెలుపొందారు.  గతంలో కంటే డెమోక్రాట్ల గవర్నర్లు ఏడుగురు పెరగడంతో డెమోక్రాట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చెప్పాలంటే మధ్యంతర ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ ముందంజలో ఉండడంతో వచ్చే ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ విజయం దిశగా ముందుకు వెళ్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

US Midterm Elections Update: Democrats  Won in House
Telangana news

Comments

comments