Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

యుఎస్ ఓపెన్ ఫైనల్లో  జకో x వావ్రింకా

tenniesన్యూయార్క్ యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో టాప్‌సీడ్ నొవక్ జకోవిచ్, మూడోసీడ్ స్టానిస్లాస్ వావ్రింకా పోరుకు సిద్ధమయ్యారు. శనివారం తెల్లవారు జామున జరిగిన సెమీస్‌లో జకోవిచ్.. మోన్‌ఫిల్స్‌పై, వావ్రింకా.. నిషికోరీపై గెలిచారు. రెండు గంటలా 35 నిమిషాల పాటు సాగిన మొదటి సెమీస్‌లో జకోవిచ్ 6-3, 6-2, 3-6, 6-2తో విజయం సాధించాడు. సెమీస్‌కు చేరే క్రమంలో ఒక్క మ్యాచ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొని జకోవిచ్‌కు మోన్‌ఫిల్స్ కూడా పోటీఇవ్వలేకపోయాడు. తొలిసెట్ ఆరంభంలోనే రెండుసార్లు మోన్‌ఫిల్స్ సర్వీస్ బ్రేక్ చేసిన జకో 5-0తో నిలిచాడు. ఈ దశలో సెట్‌ను జకో లవ్(6-0)తో గెలిచేలా కనిపించాడు. అయితే సర్వీస్ కాపాడుకున్న మోన్‌ఫిల్స్ తరువాతి గేమ్‌లో మూడు సెట్ పాయింట్‌లు కాచుకొని ఆధిక్యాన్ని 2-5కు తగ్గించాడు. ఇక తొమ్మిదోగేమ్‌లోనూ జకో సర్వీస్ బ్రేక్ అయ్యేలా కనిపించినా రెండుసార్లు బ్రేక్ పాయింట్ కాపాడుకున్న జకో సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్నాడు. రెండోగేమ్‌లో మొదట్లోనూ 5-1తో దూసుకెళ్లిన జకో సునాయాసంగానే గెలిచాడు. అయితే మూడోసెట్‌లో జకోకు గట్టిపోటీ ఎదురైంది. సెట్ మొదటిగేమ్‌లోనే సర్వీస్ కోల్పోయిన మోన్‌ఫిల్స్.. నాలుగు, ఆరు గేమ్‌లలో జకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. నాల్గోసెట్ తొలిరెండు గేమ్‌లు హోరాహోరీగా సాగినా తరువాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన జకోవిచ్ సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరాడు. యుఎస్ ఓపెన్‌లో జకోవిచ్‌కు ఇది ఏడో ఫైనల్ కావడం విశేషం. ఇక నిషికోరీతో జరిగిన రెండోసెమీస్‌లో వావ్రింకా 4-6, 7-5, 6-4, 6-2తో గెలిచాడు. సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడడంలో రాటుదేలిన వావ్రింకా తొలిసెట్ కోల్పోయినా హోరాహోరీ రెండోసెట్‌ను 7-5తో గెలిచి లయను అందుకున్నాడు. మూడోసెట్‌లో నిషికోరీ నుంచి పోటీ ఎదురైనా నాల్గో సెట్‌లో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లు బ్రేక్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్‌లో 10 ఏస్‌లు కొట్టిన వావ్రింకా 38 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసిన నిషికోరీ 47 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

Comments

comments