Search
Sunday 18 November 2018
  • :
  • :

ఫెదరర్ x జకోవిచ్

ferder-vs-djocovicన్యూయార్క్ పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్లు జకోవిచ్, ఫెదరర్ ఫైనల్‌కు చేరారు. టోర్నీ ఆరంభం నుంచే అద్భుత ఆటతో అదరగొడుతున్న వీరిద్దరూ ఎలాంటి సంచలనాలకూ తావివ్వకుండా సెమీస్‌లో తమ ప్రత్యర్థులను వరుస సెట్లలో చిత్తుచేసి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నారు.

ఆరేళ్ల తరువాత.. : యుఎస్ ఓపెన్‌లో గత ఆరేళ్లుగా ఫైనల్‌కు చేరడంలో విఫలమవుతున్న 34 ఏళ్ల రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్ ) ఎట్టకేలకూ తుది పోరుకు అర్హత సాధించాడు. తన దేశానికే చెందిన స్టానిస్లాస్ వావ్రింకాతో జరిగిన సెమీస్‌లో 6-4, 6-3, 6-1తో నెగ్గాడు. టోర్నీ లో ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా ఓడని ఫెదరర్ సెమీస్‌లోనూ అదే ఆనవాయితీని కొనసా గించాడు. తొలిసెట్‌లో ఒకే బ్రేక్ పాయింట్‌ను న మోదుచేసిన ఫెదరర్.. 4-2తో నిలిచాడు. అయితే ఆరోగేమ్‌లో మూడుసార్లు బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న వావ్రింకా.. ఫెదరర్ ఆధిక్యాన్ని 3-4కు తగ్గించినా ఆపై మళ్లీ ఫెదరర్ స్నిక్ షాట్లతో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండోసెట్ ఆరంభంలో ఐదు బ్రేక్ పాయింట్లు నమోదుచేసిన వావి్రంకా 3-2తో నిలి చినా.. తరువాత సర్వీస్ చేసిన ఫెదరర్ 40-0తో గేమ్ నెగ్గి ముందుంజ వేశాడు. అదే ఊపులో తొమ్మిదోగేమ్‌లో వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెదరర్ సెట్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఇక మూడోసెట్‌ను ఏకపక్షంగా గెలిచిన ఫెదరర్ ఆరేళ్ల తరవాత ఫైనల్‌కు చేరాడు.

చేతులెత్తేసిన ఛాంపియన్ : మరో సెమీస్‌లో సెర్బియా యోధుడు నొవక్ దెబ్బకు డిఫెండింగ్ ఛాంపి యన్ ఆటే తెలియదన్నట్టు చేతులెత్తే శాడు. గంటా 28 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 6-0, 6-1, 6-2తో సిలిక్‌ను చిత్తుచేశాడు. మ్యాచ్‌లో ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసిన సిలిక్ 37 అనవసర తప్పిదాలు చేశాడు. ఓపెన్ ఎరా గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ సెమీస్ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా, తొందరగా ముగిసిన మ్యాచ్ ఇదే కావడం విశేషం.

Comments

comments