Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఫైనల్లో పేస్, హింగిస్, సానియా

sania-martinaన్యూయార్క్ : మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో వింబుల్డన్ ఛాంపియన్లు సానియా, హింగిస్, పేస్ టైటిల్ పోరుకు చేరారు. మహిళల డబుల్స్‌లో భాగంగా 11వ సీడ్ సారా ఎరానీ-పెనెట్టా(ఇటలీ)తో జరిగిన  సెమీస్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-4, 6-1తో వరుస సెట్లలో నెగ్గింది. 80 నిమిషాల్లోనే ఫలితం తేలిన ఈ మ్యాచ్ తొలిసెట్‌లో ప్రత్యర్థి జంట నుంచి పోటీ ఎదుర్కొన్న ఇండో-స్విస్ జోడీ రెండోసెట్‌ను మాత్రం ఏకపక్షంగా సొంతం చేసుకుంది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జోడీ 6-2, 6-5తో బోపన్న-యంగ్ చాన్(చైనీస్‌తైపి) జంటను గంటలోనే ఓడించి మూడోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరింది.

Comments

comments