Home తాజా వార్తలు భారత్ కు ట్రంప్ వార్నింగ్!

భారత్ కు ట్రంప్ వార్నింగ్!

US President Donald Trump warned India

వాషింగ్టన్: అమెరికా వద్దంటున్నా రష్యాతో భారత్ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తాజాగా మరో వార్నింగ్ ఇచ్చారు. దీనిపై తాను ఏ నిర్ణయం తీసుకోబోతున్నానో ఇండియాకు తెలుస్తుందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 500 కోట్ల డాలర్ల విలువైన ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత్ వచ్చిన సందర్భంలో ఈ డీల్ కుదిరింది. అమెరికా కొత్తగా సవరణ చేసిన కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్షుడికి మాత్రమే ఇప్పుడు భారత్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పదంపై మీరు ఏం చేయబోతున్నారు అని ట్రంప్‌ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఇండియాకు త్వరలోనే తెలుస్తుందని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఎప్పుడు అని అడిగితే… మీరు ఊహించిన దాని కంటే ముందే ఆ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

US President Donald Trump warned India