Home ఎడిటోరియల్ ఎవరొచ్చినా అమెరికాతో మైత్రే!

ఎవరొచ్చినా అమెరికాతో మైత్రే!

Cartoonsఅమెరికా అధ్యక్ష ఎన్నికకు ఇక కొద్దిరోజులే వ్యవధి వుంది. అమెరికా మొట్టమొదటిసారిగా అధ్యక్ష స్థానంలోకి మహిళా అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఎన్నుకుంటుందా లేక వివాదాస్పద కోటీశ్వరుడు డోనాల్డ్ ట్రంప్‌ను కూర్చోబెడుతుందా అన్నది ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం. ఎవరు గెలిచినా అమెరికా విదేశాంగ విధానంపై ప్రభావం ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాల్లో భారత దేశం అమెరికాతో తన సంబంధాలను పెద్దగా మార్చుకొంది. ఇందుకు ఆర్థిక కారణాలే ప్రధానం. అమెరికా అధ్యక్ష ఎన్నికపై భారత్ కన్నుపెట్టడానికి ఈ సన్నిహిత సంబంధాలే ప్రధాన హేతువు. పదవి నుంచి వైదొలగనున్న అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ కేవలం రెండేళ్ల క్రితం సంబంధాల్లో కొత్త లక్షాలను నిర్దేశించారు. 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలన్నదే ఆ లక్షం. దీన్ని సాధించడానికి అమెరికా లో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రాతిపదికను కూర్చుతుందని భారత్ ఆశిస్తోంది. ‘స్మార్ట్ సిటీ’ కార్యక్రమాన్ని సఫలం చేసుకొనడంలో అమెరికా నూతన ప్రభు త్వం ప్రస్తుత కొనసాగిస్తుందని కూడా భారత్ ఆశిస్తోంది. అజ్మీర్, విశాఖపట్టణం, అలహాబాద్ మున్నగు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. అణు కర్మాగారాల్లో జరిగే నష్టానికి రూపొందించిన 2010 ‘పౌర అణు నష్టపరిహార చట్టం’పట్ల అమెరికా ఆందో ళనలను పారద్రోలడానికి మోడీ ప్రభుత్వం చర్యలు తీసు కొంది. అందుకు గాను ‘భారత అణు బీమా పూల్’ను నెలకొల్పింది. అణు కర్మా గారాల్లో జరిగే ప్రమాదాలకుగాను ఆపరేటర్లకు దీని నుంచి ఆర్థిక చెల్లింపులు చేస్తారు. రెండు దేశాలమధ్య పౌర అణుసహకారం పెంపొంద డానికి అడ్డంకిని ఈ చర్యతో భారత ప్రభుత్వం తొలగిం చింది. పౌర అణుఒప్పందం సాధ్య మైనంత త్వరలో అమలులోకి వచ్చేలా చేసే బాధ్యత ఇక అమెరికాదే.

భారత రక్షణ శాఖకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా అమెరికా రూపొందింది. ఇరుదేశాల మధ్య రక్షణ పరమైన వాణిజ్యం 2015లో 14 వందల కోట్ల డాలర్లను దాటింది. మోడీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారం భించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం విజయవంతం కావడానికి కూడా అమెరికా సహకారం భారత్‌కు అవసరం. భద్రత విషయంలో చైనాపట్ల భారత్‌కు కొన్ని భయాలు ఉన్నాయి. వివాదాస్పద భూభాగాలపట్ల చైనా వైఖరి, పాక్- చైనా మధ్య పెరుగుతున్న సహకారం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాకిస్థాన్ మొత్తం ఆయుధ అవసరాల్లో 63 శాతం చైనా అందిస్తోంది. ఈ కారణాలవల్ల దక్షిణ ఆసియాలో అమెరికా ఉనికిని భారత్ కోరుకొంటోంది. అందువల్ల ఆ ప్రాంతంలో తనకు అనుకూలంగా పరిస్థితు లు మారుతాయని భారత్ ఆశిస్తోంది. అమెరికా అధునాతన ఆయు ధాలు, సాంకేతిక విజ్ఞానం లేనిదే తన సైన్యాన్ని ఆధునీకరించలేమని భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. టెర్రరిజాన్ని తమ గడ్డ మీదనుంచి తరిమే యడంలో తగినంతగా చర్యలు తీసుకొని పాకిస్థాన్‌ను ఏకాకిని చేయా లన్నా అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు జరపడం, భద్రత చర్చలను ముందుకు తీసుకుపోవడం భారత ప్రభుత్వం చేయాల్సి ఉంది. దక్షిణ ఆసియాలో వేగం గా మారుతున్న భద్రతా వాతావరణం దృష్టా దీనికి అదనపు ప్రాము ఖ్యత ఏర్పడింది. జమ్ము-కశ్మీర్‌లోని యురి సైనిక స్థావరంపై గత సెప్టెంబర్ లో జరిగిన ఉగ్రదాడివల్ల ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇండియన్ – అమెరికన్ వర్గం ఓట్లను గెలుచుకోవడం కోసం రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భారత్ గురించి, భారత ప్రజల గురించి తన ప్రచారం చివరలో ఎన్నో సానుకూల వ్యాఖ్యలు చేశారు. మోడీని గొప్ప వ్యక్తిగా కొనియాడిన ఆయన హిందువుల అభిమానినని చాటుకున్నారు. హిందూ జాతీయవాద ప్రకటనలతో భారత సంతతివారిని ఆకర్షించడానికి ఎంతగానో ప్రయత్నించారు. యురి ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. అలా చేయడం ద్వారా తన ప్రభుత్వంవస్తే సీమాంతర టెర్రరిజం విషయంలో పాకిస్థాన్‌తో కఠినంగా వ్యవహరిస్తుందన్న సందేశాన్ని ఇచ్చారు. బడా వ్యాపారవేత్తగా ట్రంప్‌కు భారత్‌తో కొన్ని ప్రయోజనాలు ముడిపడి ఉన్నా యి. ఉదాహరణకు ముంబయిలో నిర్మాణంలో ఉన్న విలాసవంతమైన వ్యాపార భవనం. అయితే వలసలపట్ల ట్రంప్ భావాలు భారత దేశాన్ని వెంటాడుతున్నాయి. అత్యంత నైపుణ్యంగల కార్మికుల కోసం ఇచ్చే హెచ్ -1బి వీసాలు అత్యధికంగా పొందుతున్న దేశం భారత్. 2014 ఆర్థిక సంవ త్సరంలో మొత్తం 316,000 హెచ్ -1బి వీసాల్లో భారత్ వాటా 70 శాతం. తాను అధ్యక్షుడిని అయితే హెచ్ -1 బి వీసాదారులకు కనీస వేతనాలు పెంచుతానని ట్రంప్ చెప్పారు. అందువల్ల వలసలను కఠినతరం చేస్తానని కూడా ప్రకటించారు. అంటే భారతీయ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అమెరికా వలస జనాభా లెక్కల ప్రకారం 2013 – 14 లో భారత సంతతికి చెందిన 103,000 మంది విద్యా ర్థులు అమెరికా విద్యా సంస్థల్లో చేరి ఉన్నారు. ఇందువల్ల చైనా తరువాత భారతదేశమే అమెరికాలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులను కలిగి ఉన్న దేశమైంది. ట్రంప్ ప్రకటనల్లో ఆందోళనకరమైన మరొక అంశం ఏమిటంటే – ‘అమెరికాలోకి ప్రవేశించకుండా ముస్లింలను నిషేధిస్తాను’ అన్న ప్రకటన. ప్రపంచంలోకే అత్యధికంగా ముస్లిం జనాభా గల రెండవ దేశం భారత్. రష్యాపట్ల అనుకూలతగల ట్రంప్ అధికారంలోకి వస్తే చైనాపట్ల అమెరికా విధానాన్ని మార్చవచ్చు. అదే జరిగితే భారత్‌కు తీవ్రమైన భద్రతా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఇక డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భారత్‌తో వ్యక్తిగత సాన్ని హిత్యం కలవారు. 1995 నాటి సందర్శనతో ఆమె భారత్‌కు దగ్గరయ్యారు. ఆమె భర్త బిల్ క్లింటన్ హయాంలో భారత్‌పట్ల వైఖరి మార్చుకోవడానికి ఆమె కారణమని చెబుతారు. 1998 అణు పాటవ పరీక్షలవల్ల అమెరికాతో భారత్ సంబంధాలు బాగా దిగజారాయి. అయితే హిల్లరీ క్లింటన్‌వల్ల తిరిగి సంబం ధాలు మెరుగుపడ్డాయి. సెనెట్‌లో భారత అనుకూల వర్గానికి హిల్లరీ సార థ్యం వహించారు. 1995లో హిల్లరీ క్లింటన్ తాజ్‌మహల్ సందర్శించారు. అత్యున్నత సాంకేతిక రంగం, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందేందుకు హిల్లరీ చాలా కృషి చేశారని విశ్లేషకులు చెబు తారు. ఆసియాలో అధ్యక్షుడు ఒబామా విధానపరమైన మార్పులలో కూడా ఆమె కీలకపాత్ర పోషించారు. చెన్నైలో 2011లో ఆమె ఇచ్చిన ప్రసంగం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైనదిగా పేరొం దింది. ఆ ప్రసంగంలో ఆమె, ‘భారత దేశం సారథ్యం వహించాల్సిన సమ యం వచ్చింది.21వ శతాబ్దపు చరిత్రను చాలా భాగం ఆసియా తిరగ రాస్తుంది. అందులో చాలా భాగం భారత, అమెరికాల భాగస్వామ్యం నుంచి ప్రభావిత మౌతుంది. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు కూడా ఆ చరిత్రలో ప్రముఖ అధ్యాయం అవుతుంది’ అని అన్నా రు. ఆమె ఎన్నికయితే అమెరికాల సంబం ధాలను కొత్త శిఖరాలకు తీసుకు పోతారని ఆమె ప్రచార అధిపతి జాన్ పోడెస్టా చెప్పారు. భారత్‌తో మంచి ఆర్థిక సంబం ధాలు అమెరికాకు ఏర్పడితే ఆ ప్రాంతంలో అమెరికా పావులు కదిపే స్థాయికి వస్తుందని కూడా జాన్ అన్నారు. హిల్లరీ క్లింటన్‌కు భారతదేశపు నాయ కుల నుంచి అణుఒప్పందం అంశంలో మద్దతుకోసం నిధులు అందాయని ఆమె ప్రత్యర్థి ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇరువురిలో ఎవరు ఎన్నికయినా ద్వైపాక్షిక సంబంధాలపట్ల అనుసరించే వైఖరే భారత్ కు ప్రధానం కానుంది.

– సుమిత్ కుమార్ ఝా