Home స్కోర్ ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోచ్‌గా ఉసేన్ బోల్ట్

ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోచ్‌గా ఉసేన్ బోల్ట్

game

సిడ్నీ: ఆస్ట్రేలియా-ఇగ్లాండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక యాషేస్ సిరీస్‌కు ఇరు జట్లు సంసిద్ధ్దమయ్యాయి.   వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేందుకు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లకు జమైకన్  రిటైర్డ్ స్పింట్ రారాజు  ఉసేన్ బోల్ట్  శిక్షణనిస్తున్నాడు. ఈ జమైకన్ 100, 200 మీటర్ల విభాగాల్లో  8 ఒలింపిక్స్ పతకాలు అందుకొని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గత లండన్ వరల్డ్  ఛాంపియన్‌షిప్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికిన బోల్ట్ తాజాగా రన్నింగ్ కోచ్ అవతారమెత్తాడు. ‘పరుగు అందుకునే సమయంలో క్రికెటర్లు నెమ్మదిగా ఉంటారని, అక్కడే అసలు సమస్య ఉందని బోల్ట్ చెప్పాడు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే క్రికెటర్లు కూడా వేగంగా పరుగెత్తగలుగుతారని అతనన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలా పరుగెత్తాలన్న దానిపై తాను క్రికెటర్లలో అవగాహన పెంచుతున్నట్లు బోల్ట్  ‘ది హెరాల్డ్ ’ దినపత్రికకు తెలిపాడు. బోల్ట్ రన్నింగ్ టిప్స్ యాషేస్ సిరీస్‌కు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆసీస్ క్రికెటర్ హ్యాండ్‌స్కోంబ్ తెలిపాడు. వికెట్ల మధ్య వేగంగా ఎలా పరుగెత్తాలో, అదే వేగంతోఎలా వెనక్కి రావాలో శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నాడు.