Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

జీరో గ్రావిటీలోనూ బోల్టే హీరో

Usain Bolt wins In Zero Gravity Race
పారిస్: జమైకన్ చిరుత ఉసేన్‌ బోల్ట్ ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని అనితర రికార్డు ‘ట్రిపుల్ ట్రిపుల్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. బోల్ట్ పరుగులో నెలకొల్పిన రికార్డులను ఇప్పట్లో అందుకోవడం సాధ్యపడకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. అతగాడు పరుగు పెడితే 100 మీటర్లైనా, 200 మీటర్లైనా, 400 మీటర్లైనా ఆయన ముందు దాసోహం కావాల్సిందే. దీంతో పరుగు ఎదైనా విజేత మాత్రం బోల్టే అనే అభిప్రాయం అభిమానుల్లో కొన్నేళ్లుపాటు అలా ఉండిపోయింది. ఇక రిటైర్ అయినా ఈ స్టార్‌ స్ప్రింటర్‌ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. తాజాగా జీరో గ్రావిటీ పరుగులోనూ బోల్ట్ అదరగొట్టాడు. తనతోపాటు పోటీలో పాల్గొన్న ఫ్రెంచ్ వ్యోమగామి జీన్‌ ఫ్రాంకోయిస్‌, నోవెస్పేస్‌ సిఇఒ ఆక్టేవ్‌ డి గల్లెతో కలిసి బోల్ట్ పరుగు తీశాడు. ఈ పరుగులో మొదట తడబడినట్లు కనిపించిన బోల్ట్‌ చివర్లో మాత్రం తనదైన శైలిలో విజేతగా నిలిచాడు. జీరో స్పేస్‌ సాంకేతికత తెలిసిన వారిపై అదే వాతావరణంలో సరదాగా జరిగిన పరుగులో బోల్ట్ ఆకట్టుకున్నాడు. జీరో గ్రావిటీతో ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్‌బస్‌ జీరో జీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత బోల్ట్ తనదైన విజయ చిహ్నంతో ఫోటోలకు ఫోజిచ్చాడు. అనంతరం తన స్టైల్లో షాంపైన్‌ బాటిల్‌తో విజయాన్ని సెలబ్రెట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Comments

comments