Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బంకమట్టి వినాయక విగ్రహాలను వాడాలి

poloceబంకమట్టి వినాయక విగ్రహాల మండపాలకు మాత్రమే ప్రభుత్వ సహకారం ఆర్డీవో
బంకమట్టి వినాయక విగ్రహాల మండపాలకు మాత్రమే కరెంట్, డిజె సౌండ్స్, పోలీసు బందోబస్తు అనుమతి
భానుపురి : పర్యావరణ పరిరక్షణ మహమ్మారిగా ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా బంకమట్టి వినాయక విగ్రహాలను వాడాలని మున్సిపల్ చైర్‌ప ర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బంకమట్టి వినాయక విగ్రహాలు వాడాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సద స్సుకు కౌన్సిలర్లు మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్లు, అధికారులు, ఆయా వార్డుల్లో, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమ తుల్యత కాపాడుతూ ప్రజల ఆరోగ్యంలా పరిరక్షణ కొరకు పివోపి విగ్రహములకు బదు లుగా బంకమట్టి వినాయక విగ్రహములను ప్రతిష్టించి పూజించుటకుగానూ ప్రజల్లో అవగాహన పెంపొందించవల్సింది మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశములతో అన్ని వర్గముల వారిచే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. హిందూ ధర్మం సాంప్రదాయం ప్రకారం గణనాధుడిని మట్టితో తయారు చేసి పూజించిన పక్షంలో పుణ్య ఫలములు దక్కునని అన్నారు. గత సంవత్సరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి వార్డుకి ఒక బంకమట్టి విగ్రహం ఇవ్వడం జరిగిందని ఈ సంవత్సరం ప్రతి వార్డుకి రెండు విగ్ర హాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. యువకులు, వివేకానందుని సూక్తుల స్ఫూర్తిని అలవర్చుకొని బంకమట్టి వినాయకులను మాత్రమే నెలకొల్పుటకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఆర్డీవో సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ బంకమట్టి విగ్రహాలు పెట్టిన మండములకు మాత్రమే డిజి సౌండ్స్, కరెంట్, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు బంకమట్టి విగ్రహాలను మాత్ర మే వాడాలని ప్రజలకు సూచించారు. అనంతరం ప్రజలతో బంకమట్టి విగ్రహాలే వాడుతా మని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నేరేళ్ల లక్ష్మీ, మున్సిపల్ కమీషనర్ వడ్డె సురేందర్, డిఎస్పీ సునితామోహన్, మున్సిపల్ మేనేజర్ ఎంఎస్ రాంచం దర్‌రావు, తహసీల్దార్ మహమూద్ అలీ, సిఐ మొగిలయ్య, ఎక్సైజ్ ఎస్సై ఎండి జాఫర్, టిఆర్‌ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆకుల లవకుశ, వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, రంగినేని ఉమా, షాహిన్‌బేగం, ఎండి షఫీవుల్లా, ఎల్గూరి జ్యోతి, అనంతుల మల్లీశ్వరి, వల్దాస్ దేవేందర్, గ్రీన్ క్లబ్ అధ్యక్షులు ముప్పారపు నరేం దర్, నాగవెళ్లి బ్రహ్మయ్య, వివిధ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Comments

comments