Home తాజా వార్తలు చిన్నచిన్న పనులకు సైకిల్ వినియోగించాలి : ఈటెల

చిన్నచిన్న పనులకు సైకిల్ వినియోగించాలి : ఈటెల

eetelaహైదరాబాద్ : రవీంద్రభారతీలో మంగళవారం జరిగిన ఇంధన సంరక్షణ క్షమత మహోత్సవాలలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన గాలి కోసం చెట్లు పెంచడం ఎంత ముఖ్యమో.. ఇంధనాన్ని పొదుపు చేయడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలు చిన్న చిన్న పనులకు సైకిల్‌ను వినియోగించాలని, గమ్యస్థానాలు చేరుకోవడానికి సొంత వాహనాల కంటే ప్రజా రవాణానే ఉపయోగించాలని సూచించారు. దేశ బడ్జెట్‌లో మూడో వంతు నిధులను ఇంధనానికే కేటాయించాల్సి వస్తోందని, పెట్రో ఉత్పత్తుల వాడకం పెరిగి ప్రజలు కాలుష్యం బారిన పడాల్సి వస్తోందని తెలిపారు.