Home లైఫ్ స్టైల్ పెయిన్ కిల్లర్లతో జాగ్రత్త…

పెయిన్ కిల్లర్లతో జాగ్రత్త…

Pain Killers

 

వ్యాయామం చేశాక కొన్నిసార్లు కండరాల నొప్పులు వేధిస్తుంటాయి. ఆ సమయంలో పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు కొందరు. అయితే పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇబుప్రోఫెన్, అసిటమినోఫిన్ అనే మందులు వ్యాయామంతో అలసిన కండరాలకు ఏ విధంగా సహాయపడకపోగా, కండరాల ఎదుగుదల కుదించుకుపోయేలా చేస్తాయి.

కాబట్టి కండరాల నొప్పులను తగ్గించుకోవడం కోసం వ్యాయామం అనంతరం తప్పనిసరిగా స్ట్రెచింగ్ చేయాలి. అలాగే ఎలాంటి వ్యాయామాలు మొదలుపెట్టే ముందైనా, అందుకు శరీరాన్ని సన్నద్ధం చేయడం కోసం వార్మప్ చేయాలి. ఇవన్నీ అనుభవజ్ఞులైన వ్యాయామ శిక్షకుల పర్యవేక్షణలో చేయాలి.

వ్యాయామంతో అలసిన కండరాలు తిరిగి శక్తిని పుంజుకోవాలంటే మాంసకృత్తులు సరిపడా తీసుకోవాలి. వ్యాయామం ముగించిన తర్వాత బలవర్థకమైన, మాంసకృత్తులతో కూడిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా కూడా నొప్పులు తలెత్తకుండా నియంత్రించుకోవచ్చు.

Use of Pain Killers is not Good for Health