Search
Monday 24 September 2018
  • :
  • :

గదులు పెద్దవిగా కనిపించాలంటే…

Use the blue green color combination to walls of the room

ఇల్లు చిన్నగా ఉన్నా ఇంటీరియర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పెద్దగా కనిపిస్తాయి అంటున్నారు డిజైనర్లు. గదికి వేసే రంగు లైట్ కలర్ వాడాలనుకుంటారు కొంతమంది. కానీ దానిలో నిజం లేదు. ఆ గదిని మనం ఎందుకు ఉపయోగిస్తున్నామో దానిని బట్టి వేసే రంగు ఎన్నుకోవాలి. అది బెడ్‌రూమ్ అయితే వామ్ కలర్స్, బాతరూమ్ అయితే కూల్ షేడ్స్ వాడాలి. ముదురు నీలం రంగు వేస్తే హాయిగా అనిపిస్తుంది.

గోడలకు పెయింట్ వేసేటప్పుడు సీలింగ్‌కు పది సెంటిమీటర్లు కిందనుంచి వేయాలి. పెయింట్ వేసేటప్పుడు సీలింగ్‌కు పది సెంటిమీటర్లు కిందనుంచి వేయాలి. బ్లూ, గ్రీన్ రంగుల మిశ్రమం వాడితే చాలా బాగుంటుంది.
ఫర్నిచర్, ఫ్యాబ్రిక్‌కు అనువుగా గోడలకు రంగుని వేయాలి. ఇలా చేయడం వల్ల చూడగానే ప్రశాంతమైన భావన కలుగుతుంది. గది కూడా ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఇందుకు గ్రీన్ కలర్ షేడ్స్ బాగుంటాయి.

చిన్న గదికి ఉడ్‌వర్క్, మౌల్డింగ్స్ చేయించుకునేటప్పుడు అవి గోడ రంగుకంటే ఒక షేడ్ డార్క్ ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా చేయడం వల్ల కాంట్రాస్ట్‌గా ఉండి గది పెద్దదిగా కనిపిస్తుంది. లేత బూడిద రంగు గోడలకు, ముదురు బూడిద రంగు ఉడ్‌వర్క్ చేయిస్తే కొత్తగా ఉంటుంది. గోడలకు పెయింట్ చేశాక పెద్ద పెద్ద అద్దాలు అమర్చడం వల్ల ఆ గది వైశాల్యం రెండింతలు పెరిగినట్టు అనిపించి ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. కొన్ని ఇలాంటి మార్పులుచేసుకుంటే ఇల్లు చిన్నగా ఉన్నా పెద్దవిగా కనిపిస్తాయి.

Comments

comments