Home తాజా వార్తలు వెనిగర్‌ను వాడుతున్నారా?

వెనిగర్‌ను వాడుతున్నారా?

Vinegarఇంటిని శుభ్రం చేయడంలో వెనిగర్ చక్కగా ఉపయోగపడుతుంది. కానీ దాన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యం.
* గ్రానైట్, పాలరాతితో చేసిన నేల ఉంటే దాన్ని వెనిగర్‌తో తుడవకూడదు. అది వాటికుండే సహజ మెరుపును ఇది తగ్గిస్తుంది. వాటికోసం ప్రత్యేకంగా తయారుచేసిన గాఢత తక్కువున్న క్లీనర్లు ఎంచుకోవడం మంచిది.
* అనుకోకుండా గుడ్డు జారికిందపడితే దాన్ని శుభ్రం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనిగర్‌ను వాడొద్దు. దానివల్ల సొన మొత్తం విరిగిపోయి తుడవడం కష్టం.
* వెనిగర్‌ను చెక్క వస్తువులపై మరకలు పోగొట్టడానికి వాడతారు. కానీ దాన్ని నేరుగా కాకుండా గాఢత తగ్గించేందుకు కాస్త నీళ్లు కలిపి వాడాలి. లేదంటే చెక్కమీద మెరుపు పోతుంది. అయితే అన్ని రకాల ఫర్నిచర్లకు ఇదే వర్తించకపోవచ్చు.
* దుస్తులమీద పడ్డ సిరా, రక్తం మరకలు వెనిగర్‌తో వదలవు. వాటికి త్వరగా ఇంకిపోయే తత్వం ఉంటుంది. ఎంత ఉతికినా మరకలు మాత్రం పోవు. వాటిని స్టెయిన్ రిమూవర్‌లూ, డిటర్జెంట్లు ఉపయోగించి ఉతకడమే మంచిది.

Uses and Benefits of Vinegar