Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నాలుగేళ్ల పాలనలో కెసిఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు: ఉత్తమ్

Utham Kumar reddy

హైదరాబాద్‌: హైదరాబాద్ బోడుప్పల్‌లో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏ రోడ్డు చూసినా గుంతలు, మురుగునీరు దర్శనం ఇస్తోందని అన్నారు. ఎన్నికల ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు అమలు కావడం లేదని ఆయన అన్నారు.

Comments

comments