Search
Saturday 17 November 2018
  • :
  • :

దండుకోవడానికే రీడిజైన్

ప్రాజెక్టులపై ఉత్తమ్‌కుమార్

Congress

షాద్‌నగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, స్కాలర్‌షిప్‌లకు నిధులు కేటాయించకుండా వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రాజెక్టులు రీ డిజైన్ చేయడమే తప్ప టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఎక్కడున్నాయో చూపించాలని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎన్‌ఎస్‌యుఐ, షాద్‌నగర్ మాజీ ఎంఎల్‌ఎ చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగసభ కు ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఉత్తమ్ మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో ప్రాజెక్టులు ప్రారంభించామని, నేడు కెసిఆర్ ఆ ప్రాజెక్టుల నమూనాలు మార్చి కాలం వెల్లదీస్తూ కోట్లు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ఇంటికో ఉద్యో గం అని చెప్పినా కనీసం గ్రామానికో ఉద్యోగమైనా ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో అందాయని అన్నారు. ప్రభుత్వ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులుకు మౌలిక వసతులు కల్పిడంలో పూర్తిగా విఫలమైందని, కెజి టు పిజి విద్య హామీ ఏమైందని, గురుకులాలు ప్రారంభించామని చెప్పుకోస్తున్న ప్రభుత్వం గతంలో ఉన్న వాటి పరిస్థితి ఏం చేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా మిషన్ భగీరథ పథకానికి 25 కోట్లు కేటాయించారని చెప్పారు. కెసిఆర్ కేవలం మాటలతోనే మభ్యపెట్టడం తప్ప పనులు చేసింది ఏమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతామని చెప్పారు. టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్, ఎన్‌ఎస్‌యుఐ జాతీయ అధ్యక్షులు ఫెరోస్‌ఖాన్, రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బలరాం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పురుషోత్తంరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ అగ్గనూరి విశ్వం, కొత్తూర్ ఎంపిపి శివశంకర్‌గౌడ్, ఫరూఖ్‌నగర్ ఎంపిపి బుజ్జి బాబునాయక్ పాల్గొన్నారు.

Comments

comments