Home తాజా వార్తలు నాలుగేళ్లలో 4000 మంది రైతులు ఆత్మహత్య…

నాలుగేళ్లలో 4000 మంది రైతులు ఆత్మహత్య…

UttamKumar-Reddy

హైదరాబాద్:  టిఆర్‌ఎస్ నిర్లక్ష్య వైఖరి వల్ల నాలుగేళ్లలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రావతరణ వేడుకలలో  ఉత్తమ్  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మం, వరంగల్, వికారాబాద్‌లో పంటకు గిట్టుబాటు ధర కోసం రైతులతో కలిసి పోరాటం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో దళితులు, మైనార్టీలు, బిసిలకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల తరపున అనేక ఉద్యమాలు చేశామని వివరించారు. న్యాయం కోసం పోరాడిన సామాన్యుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఖమ్మంలో మిర్చికి మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి అరెస్టు చేశారని, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ చేసిన తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. వ్యవసాయ రుణాలపై వడ్డీ భరిస్తామని సిఎం హామీ ఇచ్చి మోసం చేశారని కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.