Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆ విమానాల కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి…

Jana-Reddy-and-Uttam-Kumar-

హైదరాబాద్: సోమాజీగూడలో సోమవారం ఉదయం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజీవ్ గాంధీ విగ్రహానికి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, విహెచ్ నివాళులర్పించారు. మరో మూడు నెలల్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోడీ పరిపాలనలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ఎన్‌డిఎ అవినీతి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఆర్థిక సంస్కరణలు, మతసామరస్యానికి రాజీవ్ గాంధీ కృషి చేశారని కాంగ్రెస్ నేత జానారెడ్డి కొనియాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన నేత రాజీవ్ అని ప్రశంసించారు.

Comments

comments