Home తాజా వార్తలు అప్పుడు.. టిఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కులేదు..

అప్పుడు.. టిఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కులేదు..

Uttam-Kumar-Reddy

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలిస్తే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. నలుభై నెలలు గడిచిందని టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంతో ఎక్కడికి రమ్మన్నా తాము వస్తామన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కెసిఆర్ అధికారంలోకి వచ్చారని, 2019 ఎన్నికల లోపు 12 శాతం రిజర్వేషన్లు సాధించలేకపోతే ఓట్లు అడిగే హక్కు టిఆర్‌ఎస్ పార్టీకి లేదని విమర్శించారు.