Home తాజా వార్తలు కెసిఆర్ గద్దె దిగడం ఖాయం: ఉత్తమ్

కెసిఆర్ గద్దె దిగడం ఖాయం: ఉత్తమ్

TPCC Chief Uttam Kumar Reddy Fires on KCR Govt

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై సిఎం కెసిఆర్ సవాల్ కు ధీటైన సమాధానం ఇచ్చారు.  కెసిఆర్ సవాల్ పై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు 2019లో వచ్చినా… డిసెంబర్‌లో వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు కొన్ని రోజులలో శుభవార్త వింటారని,  టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలవడం కష్టమేనని స్పష్టం చేశారు. కెసిఆర్ ను త్వరగా గద్దె  దించేయాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు.