Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆగస్టులో రాహుల్ పర్యటన : ఉత్తమ్

UTTAM_manatelanganaహైదరాబాద్ : ఆగస్టు మూడో వారంలో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధి రెండు రోజులు పర్యటిస్తారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌లో జరిగే అంబేద్కర్ 120వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారని చెప్పారు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో రాహుల్ భేటీ అవుతారని , గాంధీభవన్‌లో కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గృహ నిర్మాణ పథకం ఆగిపోయిందని ఆరోపించారు. విచారణ పేరుతో పేదల బిల్లులు ఆపడం సరికాదని ఆయన అన్నారు. పేదల బిల్లులు ఆపడంపై ఆగస్టు నాలుగున తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేస్తామని ఆయన తెలిపారు.

Comments

comments