Home జాతీయ వార్తలు ఉత్తరప్రదేశ్‌లో సంరక్షణకు కొత్త చట్టం

ఉత్తరప్రదేశ్‌లో సంరక్షణకు కొత్త చట్టం

taj-mahalలక్నో : పర్యాటకుల సంరక్షణ, సంక్షేమం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాను ంది. 2016 పర్యాటక విధానంలో భాగంగా దీని ని రూపొందించనుంది. సందర్శకులు దోపిడీకి గురికాకుండా వారి సంక్షేమం, సంరక్షణ కోసం ఈ నూతన చట్టం తీసుకురానున్నట్టు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవనీత్ సెహగల్ చెప్పా రు. యుపి పర్యాటక రంగానికి ఒక బ్రాండ్‌లా మారిందన్నారు. అన్ని రకాల వసతులు, హోదా కల్పించి పర్యాటరంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తామని తెలియజేశారు. పర్యాటక రంగంలో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ పరిశ్రమ సహాయం తీసుకుంటామని సెహగల్ వివరించారు. కొత్త విధానంలో ఏడు కొత్త సర్కూట్లను చేర్చామని, కొత్త ప్రదేశాలను గుర్తి స్తామని తెలిపారు. సూపర్‌ఫాస్ట్ రైళ్లతో వారణాసి, గోరఖ్‌పూర్‌లను దేశ రాజధాని ఢిల్లీతో అనుసంధానానికి కృషి చేస్తామని చెప్పారు. యుపి ప్రభుత్వం ఇటీవలే పర్యాటక విధానాన్ని ప్రకటించింది.