Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మహేష్‌ను కలిసిన సిఎం

Mahesh

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, విలక్షణ దర్శకుడు కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో మహేష్ తన 25వ సినిమా షూటింగ్‌ను  ప్రారంభించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్పాట్‌కు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వచ్చి మహేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు. మహేష్, రావత్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డెహ్రాడూన్‌లో షూటింగ్‌కు అన్ని విధాలా సహకరిస్తామని ఈ సందర్భంగా సిఎం రావత్ చెప్పినట్లు తెలిసింది. కాగా ఈ సినిమాలో మహేష్ ఎంబిఎ స్టూడెంట్‌గా కనిపించనున్నాడని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ఈ సూపర్‌స్టార్ రాయలసీమ యాసలో మాట్లాడుతాడట. ఈ సినిమాకు సంబంధించి న్యూయార్క్‌లో కొంత భాగం షూటింగ్ జరుగుతుందని తెలిసింది. కొన్ని కీలకమైన సన్నివేశాలను కర్నూల్‌లో చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లరి నరేశ్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. దిల్‌రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Comments

comments