Home గాసిప్స్ ముఖ్యమంత్రా.. మజాకా..!!

ముఖ్యమంత్రా.. మజాకా..!!

HarishRavat

అసలే ఆయన ముఖ్యమంత్రి.. తెలుసు కదా.. ఉత్తరాఖండ్ సిఎం హరీశ్ రావత్.. అయితే, ఈ మధ్య ఆయన దగ్గరికి వచ్చి ఓ మహిళ తన బాధలను చెప్పుకొందట. ఆయన కాళ్ల మీద పడి తన బాధలను ఎలాగైనా తీర్చాలని వేడుకుందట. తన గోడు వెళ్లబోసుకుందట.

అయితే, హరీశ్ రావత్ మాత్రం ఆ మహిళ గోడును పట్టించుకోకుండా… హ్యాపీగా నవ్వుతూ కూర్చున్నాడట( పై ఫోటో దానికి సంబంధించిందే). ఇక, అక్కడే ఉన్న మీడియా ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారట. అంతే కాదు, ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.

ఆయన అలా నవ్వుతుంటే పక్కనే ఉన్న మహిళా పోలీసులకూ చిరాకు వచ్చిందట. అక్కడున్న వాళ్లకు కూడా కోపం వచ్చి హరీశ్ వైపు చూసేసరికి, సరే సరే… ఆ.. చూస్తాలే.. అనే సరికి అక్కడున్న పోలీసులు ఆమెను లాగేశారట. అది సంగతి…