Search
Friday 21 September 2018
  • :
  • :

మహేష్‌ను కలిసిన ముఖ్యమంత్రి..!

Uttarakhand CM Trivendra Singh Rawat meets Mahesh Babu

డెహ్రాడూన్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘భరత్ అనే నేను’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ వంటి భారీ డిజాస్టర్‌తో సతమతమైన ప్రిన్స్ భరత్‌తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న మహేష్ తాజాగా తన తరువాతి లాండ్‌మార్క్ 25వ చిత్రం షూటింగ్ ప్రారంభించాడు. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ ఈ సినిమా చేస్తున్నాడు. సోమవారం డెహ్రాడూన్‌లో మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా మహేష్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కలిశారు. కాసేపు ప్రిన్స్‌తో రావత్ ముచ్చటించారు. అయితే, మర్యాదపూర్వకంగానే మహేష్‌తో ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. మీసకట్టు, గెడ్డంతో మహేష్ సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు.

Comments

comments