Home ఆఫ్ బీట్ వీడియోలు నాకు రెండు కాళ్లు చాలు.. మిగతవి తీసేయండి..!(వీడియో)

నాకు రెండు కాళ్లు చాలు.. మిగతవి తీసేయండి..!(వీడియో)

Arun-Kumarలక్నో: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడు వింత సమస్యతో బాధపడుతున్నాడు. ఆ సమస్య ఏమిటంటే.. పుట్టకతోనే అతడికి నాలుగు కాళ్లు ఉన్నాయి. అదనంగా ఉన్న రెండు కాళ్లతో అతడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఏలాగైన తన మిగిలిన రెండు కాళ్లను తీసేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా వైద్యులను కోరాడు. దీనికోసం ఎవరైన దాతలు మంచి మనసుతో సాయం చేయాలని కోరుతున్నాడు. తనకు అదనంగా వచ్చిన రెండు కాళ్ల వల్ల అందరిలా సాధారణ జీవితం గడపలేక పోతున్నానని వాపోయాడు. అయితే అరుణ్ వినతికి ఢిల్లీలోని ఓ ఆస్పత్రి వైద్యులు స్పందించి, అదనంగా రెండు కాళ్లు ఎలా వచ్చాయనే విషయంపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.