Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అవినీతిలో తెలంగాణ రెండో స్థానం: విహెచ్

VH Comments on Governor Narasimhan
హైదరాబాద్: సిఎంఎస్ రిలీజ్ చేసిన అవినీతి అధ్యయన నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి రెండో స్థానం రావడాన్ని తెలంగాణ సర్కార్ ఎలా సమరిర్థించుకుంటుందని సీనియర్ ఎంపి వి. హనుమంతురావు ప్రశ్నించారు. హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని మాటలు చెబుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ నివేదిక చెంపపెట్టులాంటిదని ఆయన విమర్శలు గుప్పించారు.  దేశ వ్యాప్తంగా అవినీతిలో తెలంగాణ రాష్ట్రం 2 స్థానంలో ఉందంటే, ఏ మేరకు అవినీతి జరుగుతుందో అర్థమవుతుందని తెలిపారు. ఈ విషయంపై సిబిఐతో విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ నాయకులు ఎన్ని గోప్పలు చెప్పుకున్నా వచ్చే  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని హనుమంతురావు స్పష్టం చేశారు.

Comments

comments