Search
Saturday 22 September 2018
  • :
  • :

‘వచ్చాడయ్యో సామి’ సాంగ్ ప్రోమో విడుదల….

Vachaadayyo Saami Video Song Promo Released

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లకు రానుంది. తాజాగా ఈ మూవీలోని ‘వచ్చాడయ్యో సామి’ సాంగ్ ప్రోమో విడుదలైంది. మహేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. లుంగీ పైకి కట్టి .. తలకి పాగా చుట్టుకుని .. నాగలిని భుజాన పెట్టుకుని ఓ రైతులా మహేశ్ అప్పిరియన్స్ సూపర్బ్ గా ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ‘వచ్చాడయ్యో సామి’ సాంగ్ ప్రోమో కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. దేవిశ్రీ సంగీతం ఈ పాటను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది భరత్.

Comments

comments