Home సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్లు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్లు

collector*పదవీబాధ్యతలు చేపట్టిన వాసం వెంకటేశ్వర్లు, జెసిగా నిఖిలారెడ్డి
*సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటా : కలెక్టర్ వాసం

మన తెలంగాణ/సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడు తూ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషిచేయడమే కాకుండా సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూస్తామన్నా రు. ప్రజలకు చేరువగా ఉండి సమస్యలు పరిష్కరించడంలో సత్వర చర్యలు చేపడ్తామని పేర్కొన్నారు. జిల్లా మరింత అభివృద్ధి సాధించే దిశగా అందరి సహాకార, సమన్వయంతో పనిచేస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజాప్రతినిధు లు, ప్రజల సూచనలు, సలహాలను తీసుకుంటామన్నారు. ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్‌పై, విద్య, వైద్యం, వ్యవసాయ, రంగాలపై ప్ర త్యేక దృష్టిసారించనున్నట్లు తెలిపారు. జిల్లా లో ప్రతిసోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డే యథావిధిగా నిర్వహించడం జరుగుతుంద ని, గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు విధి గా హాజరై సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్‌గా నిఖిలారెడ్డి : సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నిఖిలారెడ్డి సోమవారం ఉదయం పదవీబాధ్యతలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి పొందిన వాసం వెంకటేశ్వర్లు నుండి జాయింట్ కలెక్టర్ పదవీ బాధ్యతలను నిఖిల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో క్రిష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు గుండెరావు, ఉమర్‌పాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.