Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వైజ్ఞాన ప్రదర్శనలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను సాధించాలి

nethu-pradasవిద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి
జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

తిమ్మాపూర్ : విద్యార్థులు సైన్స్, గణితంలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని మోడల్ స్కూల్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఇన్‌స్పైర్ అవార్డ్ 2016 ను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి వైజ్ఞానికి ప్రదర్శనలలో ఉత్తమ స్థానాలుగా నిలిచి విద్యార్థులు వారి ప్రయోగాలను జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందేలా కృషి చేయాలని అన్నారు. ఇలాంటి ప్రదర్శన వలన విద్యార్థులో దాగిఉన్న నైపూణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడుతాయని వాటిని అలవర్చుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు స్పూర్తినిచ్చారు. రాబోయే రోజుల్లో దేశ అభివృద్థి చెందాలంటే కొత్త కొత్త ప్రయోగాలను సృష్టించినప్పుడే దేశం బాగుపడుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస చారి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్ అవార్డ్ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తుందని ఈ వైజ్ఞానికి ప్రదర్శనలు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందిం చేందుకన్నారు. కరీంనగర్ 187 విద్యార్థులు, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన 139 విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని వీరిలో 16 మంది రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంపిక చేసి పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి ఉల్లెంగుల పద్మ, ఎంపిపి బూడిత ప్రేమలత, వైస్ ఎంపిపి పొన్నాల భూలక్ష్మి, సర్పంచ్ మాతంగి స్వరూప, పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

comments