Search
Wednesday 14 November 2018
  • :
  • :

యాదాద్రిలో వైకుంఠ వైభవం

YADADRI

మనతెలంగాణ/యాదగిరిగుట్ట : వైకుంఠ ఏకాదశి పర్వదినాన యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో అత్యంత వైభవంగా వైకుంఠ దర్శనం సాగింది. ఆలయ సాంప్రదాయ ప్రకారం శ్రీలక్ష్మీనరసింహుని వైకుంఠ ఏకాదశి పూజలను నిర్వహించారు. ఆదివారం రోజున యాదాద్రి క్షేత్రంతో పాటు అనుభంద స్వయంబు ఆలయమైన శ్రీపాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పండితులు నిర్వహించిన సుముహూర్తం ఉదయం 6.47 నిమిషాలలో లోక రక్షకుడై శ్రీలక్ష్మీనరసింహుడిని వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించు కున్నారు. అనుభంద స్వయంబు ఆలయంమైన శ్రీ పాతలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాస్రోత్త పూజలను నిర్శహించి ఉత్సవమూర్తులను దేదిప్యాయనంగా అలంకరణ చేసి అర్చకులు వేదమంత్రాలను ఉచ్చరిస్తుండగా ఆలయ ఉత్తర ద్వారం గుండా శ్రీలక్ష్మీ నరసింహుడు వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వగా భక్తకోటి దర్శించి తరించారు. శ్రీవారి ఆలయాల్లో అర్చక స్వాములు వైకంఠ ఏకాదశి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ దర్శన కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి, ఆలయ ఈవో గీత, చైర్మన్ నర్సింహ్మమూర్తి, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అధ్యాయనోత్సవాలు ప్రారంభం : యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయ అధ్యానోత్సవాలను ఆదివారం రోజున అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ చేసి ఆలయ సాంప్ర దాయ ప్రకారం శాస్త్రోత్త పూజలను నిర్వహించి అర్చకస్వాములు అధ్యాయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 8 తేది నుండి 13 తేది వరకు ఆరు రోజుల పాటు వైభవంగా నిర్వహించే అధ్యాయనోత్సవాలను పురస్కరిం చుకుని తొలిరోజున శ్రీలక్ష్మీనరసింహునికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారి, అధ్యాయ నోత్సవాల విశిష్టతను భక్తకోటికి అర్చక స్వాములు తెలియజేశారు.
ఆలయానికి పోటెత్తిన భక్తులు : శ్రీవారి వైకుంఠ పర్వదినంతో పాటు ఆదివారం వారాంతపు సెలవు కలిసి రావడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాలతో పాటు స్థానిక భక్తులు ప్రజలు తెల్లవారు జామునుండే స్వామివారి దర్శనంలో పాల్గొనా గిరి దర్శన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వైకుంఠ దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో యాదాద్రి కొండ, పాతగుట్ట ఆలయాలకు భక్తులతో రద్దీగా మారాయి.
శ్రీవారి నిత్యరాబడి రూ.17.40 లక్షలు : శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్యరాబడి 17 లక్షల 40 వేల 873 రూపాయలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెల్పారు. శ్రీవారి ఆలయంలో జరుగు పూజలు, దర్శనాలు ప్రసాదవిక్రయాలు పలు శాఖల నుండి నిత్యరాబడి ఆదాయం వచ్చినట్లు తెల్పారు.
మేళచెరువు…
మనతెలంగాణ / మేళ్ళచెరువు ః దనుర్మాసంలో ఆదివారం జరిగిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి మేళ్ళచెరువు లోని శ్రీస్వయంభు శంభులింగేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఇష్ట కామేశ్వరి అమ్మవారి రధయాత్రలో పాల్గొని రధాన్ని లాగారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజని భక్తులకు వివరించారు. ఈకార్యక్రమంలో అర్చకులతోపాటు వందలాది మంది భక్తులు రధయాత్రలో పాల్గొని తీర్దప్రసాదాలు స్వీకరించారు.
హుజూర్‌నగర్ మండల వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. బూరుగడ్డలోని శ్రీ ఆదివరహా వేణుగోపాల లక్ష్మీ నరసింహా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ గోదాదేవి అమ్మవారిని వూరసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొత్తా లలితా సుదాకర్, స్ధానా చార్యులు శ్రీనివాసా చార్యులు, రాగం లింగయ్య, విష్ణుదాస్యం ఉమా విజయ శంకర్, చుట్టు పక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మఠంపల్లి…
మన తెలంగాణ/మఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీమట్టపల్లి లక్ష్మీనరసింహుని ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి వైకుంఠద్వారదర్శనం కోసం శనివారం రాత్రినుండే మట్టపల్లికి చేరుకొని జాగారం చేసి తెల్లవారుజామున కృష్ణానదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనంకోసం బారులుతీరి స్వామివారి ఉత్సవమూర్తిని ఉత్తరముఖద్వారం దర్శించుకున్నారు. ఈసందర్బంగా స్వామివారికి తెల్లవారుజామున ప్రాతఃకాలార్చన, శ్రీస్వామివారి సుప్రభాతం, దృవస్వామివారికి అభిషేకాలు అనంతరం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్తరముఖస్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వేదమంత్రపఠనం, నాధస్వర కచేరి, పురానకాలక్షేపం, భక్తి సంగీతవిభావరి, హరికధలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో శ్రీస్వామివారికి లక్షఆరిపత్రిపూజలు నిర్వహించారు. తెల్లవారుజామునుండి భక్తులు బారులుతీరి మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి నామస్మరణలతో ఆలయన మారుమ్రోగింది. మధ్యాహ్నం 1గంటకు స్వామివారిని గరుడసేవద్వారా పురవీదులలో రేగింపు నిర్వహించి ఆలయ ప్రవేశం గావించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కోదాడ మాజీఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు , రాష్ట్రటిఆర్‌యస్ నాయకులు సాముల శివారెడ్డి, టిఆర్‌యస్ యువజవిభాగం జిలాల అధ్యక్షులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, టిఆర్‌యస్ హుజూర్‌నగర్ నియోజక వర్గ ఇంచార్జి కాసోజు శంకరమ్మ, జెడ్‌పిటిసి భూక్య నీలామాంజూనాయక్, మాజీ యమ్‌పిపి మలికంటి అంజమ్మ బుచ్చయ్య, మాజీ యమ్‌పిపిలు నర్సింగ్ వెంకటేశ్వర్లుగౌడ్, ముడావత్ కొండానాయక్, కుమ్మరికుంట లక్ష్మీవెంకటనారాయణ,సర్పంచ్ కనగాల శ్రీనివాస్‌రావు , యమ్‌పిటిసిలు రంగమ్మ ,కుక్కునూరి అంజమ్మ, నాగలక్ష్మీ, బాలునాయక్, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, కొండలు, నర్సంహారెడ్డి, నాగయ్యయాదవ్ తదితరులున్నారు.
ప్రత్యేకపూజలలో అధికారులు… వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో మట్టపల్లి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా విధ్యాదికారిని వెంకటనర్సమ్మ, కోదాడ డియస్‌పి రమణారెడ్డిలు కుటుంభ సమేతంగా హుజూర్‌నగర్ జూనియర్ సివిల్‌జడ్జి జె.శ్రీనివాసరావు వేరువేరుగా దర్శించుకుని ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా హుజూర్‌నగర్ సిఐ వారాల నర్సింహారెడ్డి, హుజూర్‌నగర్,గరిడేపల్లి యస్‌లు రంజిత్‌రెడ్డి, దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, మఠంపల్లి ఇంచార్జి యస్‌ఐ రాణి, ఎయస్‌ఐ బాలాజినాయక్ బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఇఓ యమ్‌పి లక్ష్మణ్‌రావు, శంబిరెడ్డి, శ్రీనివాసరావు, సీత, గోవింధరెడ్డి, నర్సింహమూర్తి లతోపాటు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments