Home ఎడిటోరియల్ వివాదాస్పద రచయిత్రి వాజిద తబస్సుం

వివాదాస్పద రచయిత్రి వాజిద తబస్సుం

Poetryముస్లిం స్త్రీలు కలం పట్టిన వేళ సాహిత్య రంగంలో చీకటి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. స్త్రీలంటే చులకన భావమే కాదు అణగద్రొక్కే ధోరణి ఆ రోజు లలో. ఈ రుగ్మత చదువుకున్న మరియు ఉన్నత కుటుంబాలలో కూడా జీవం పోసు కుంటున్న సమయమది! బాలల విద్య కేవలం నాలుగు గోడల మధ్య అరబ్బీ-ఖురాన్, ఉర్దూ, పర్షియన్ భాషలు నేర్పడానికి మవులి సాబులు సాయంత్రాలు విచ్చేస్తూండే వారు. ఉర్దూ సాహిత్యం ఆ రోజులలో రాయ డమే కాదు చదవడం కూడా గగనమైంది. ముస్లిం స్త్రీలలో, ఒకటి అర తప్ప! అలాంటి రోజులలో వాజిద తబస్సుం ఉర్దూ కథా రంగంలో పెద్ద ఎత్తున దుమారం లేపిన రచయిత్రి.
వాజిద తబస్సుం 1935లో మహారాష్ట్ర లోని అమ్రావతిలో జన్మించారు. 1947లో వారి కుటుంబం హైదరాబాద్‌కు తరలింది. ఆమె ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఉర్దూ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 1960లో వివాహం చేసుకున్నారు. వారి కథలల్లో హైదరాబాది ఉర్దూ వ్యవహారిక (స్థానిక) భాష తొంగి చూస్తుంది. ఆమె నవలా రచయిత్రి మరియు కవ యిత్రి కూడా. ఆమె కథ నేపథ్యం నవాబుల శృంగార రసకేళిలు, ముస్లిం ఆచార- వ్యవహా రాలు, పెండ్లి-పేరంటాలు, ఆడవాళ్ల సింగా రాలు, వేశ్యలతో నవాబుల ప్రేమ వ్యవహా రాలు, భార్యలు లోలోన కుమిలి కుమిలి గడిపే జీవితాలకు అద్దంపట్టే కథలే ఆమె రచనల చిరునామ.
“మౌల్సరీ కిచ్చావ్‌మే” (మౌల్సరీ చెట్టు నీడలో) కథలో, వయసు మళ్ళిన నవాబు ఓ పరి చారిక కొడుకు మన్సూర్‌ను తన కొడుకు గా చదువు సంధ్యలన్ని గావించి, యుక్త వయస్సులో కొచ్చాక అతడిని అందమైన ఓ అమ్మాయితో పెండ్లికి ఒప్పిస్తాడు నవాబు. మన్సూర్ ఇలాంటి షరతు గల పెండ్లికి నిరాక రిస్తే తను అతడికి చేసిన సహాయాన్ని నెమరు వేయిస్తాడు. పెండ్లి అయ్యాక కథ తారుమారు అవుతుంది. పెండ్లి కూతురు హిత తన భర్త మన్సూరులో ఇంతకు క్రితం లోపించిన గుండె ధైర్యం అతనిలో కలిగిస్తుంది. భార్యగా అన్ని విధాల అతడితో సహకరిస్తుంది. అతనిలో ఉన్న బలహీనతను పట్టి బయటికి లాగుతుంది. నవాబు గారికి ‘నీ జీవితాన్ని తన స్వార్థం కోసం ఆహుతి చేస్తున్నారు’ అని నిక్కచ్చితంగా చెప్పుతుంది. ఎంతగానో నీకు సహాయం చేసి చివరికి నీ భార్యను నవాబుకు లైంగిక వాంఛలకోసం అప్పగించడం అంటే నీలో మొగతనం, పౌరుషం చచ్చిపోయిం దనేగా అని నిలదీస్తుంది.
నవాబుగారి ప్లాన్‌ః పెండ్లి కేవలం కాగితాల మీదే. పెండ్లికూతురుకు తొలి రేయి రేయిగానే గడిచిపోవాలి! ఆమెను తాక కూడ దు? దానికి పరిహారంగా నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇవ్వగలను. నువ్వు మాత్రం మాట తప్పకూడదంటాడు. మన్సూర్ సంది గ్ధావస్థలో పడిపోతాడు. శోభనం రాత్రి ఆమె ను ముట్టుకోడు. నవాబుగారి ప్రకారం ఆమె ను వేధిస్తుండాలి. చిర్రుబుర్రులాడు తుండాలి కూడా! చివరికి నవాబుగారి ప్రణా ళిక గురిం చి ఆమెకు చెప్పుతాడు మన్సూర్. ఆమె భర్తను అర్థం చేసుకుంటుంది. ఓపిగ్గా విని, ఈ మహలును రాత్రికి రాత్రే సూర్యుడుదయిం చకముందే వెళ్ళిపోవడానికి సన్నాహ మవు తారు. నవాబుగారి హీనమైన ప్లానును ఆమె ప్లాప్ చేస్తుంది. తన పేరు హిన అంటే గోరిం టాకు. కష్టా లలో, బాధలలో ఉన్న తను గోరింటాకులా రాయిమీద ఎంత రుబ్బబడు తుందో అంతగా రంగునిస్తుందని తన భర్తతో చెప్పి అతడి మనసును దోచుకొంటుంది హిన.
వాజిద తబస్సుం 27పుస్తకాలను ప్రకా శించారు. వాటిలో ‘ఉత్రన్’, చెప్పుకో దగ్గ కథా వస్తువు. ఇది ఎనిమిది భాషలలో అనువ దించబడింది. టెలివిజియన్ సీరియల్ గా బుల్లి తెరకెక్కింది. ఈ కథలోని ప్రధాన పాత్ర ఏడేండ్ల వయసులో ఉన్న అమ్మాయి చమికి ఓ గొప్ప కుటుంబంలో ఆమె అమ్మ పరిచారికగా పనిచేస్తూంది. చమికి సమ వయస్కురాలు యజమాని కూతురు శహ జాది పాషా. వారిద్దరు బాల్య స్నేహితురాళ్లు, యుక్తవయ సు వరకు, శహజాది పెండ్లి జరిగే వరకు తను మానసికంగా బాధపడుతూ, అన్యూనతా భావంలో మునిగితేలుతూ కాలం గడుపుతూ ఉండేది. శహజాది నరనరాలల్లో నవాబుగిరి ప్రవహిస్తు ఉండేది. అవి వేల సంఖ్యలో గుండుసూదులుగా మారి చమికి గుండెలకు గ్రుచ్చుకొంటుండేవి. ధన వంతుల మాటలు, చేతలు, గర్వం, అహం కారానికి ఓ హద్దు అంటు లేకుండా సహిం చింది ఆ పసిపిల్ల చమికి. తనలో రగులుతున్న లావా పెల్లుబికి తన యజమాని కూతురికి పగలా మారింది. అది చమికి గట్టిగా లాగి కొట్టిన చెంప దెబ్బ. (?)జీవితాంతం చెరగని మచ్చ! ఉన్మాది గా నవ్వుతూ తనలోని ఆవేశాన్ని చల్లబరచు కుంది. తన మన స్థాపం ఏ విధం గా పగ తీర్చుకుని తారస్థాయికి చేరుకుందో తెలుపే కథయే ‘ఉత్రన్’.
ఆమె ముఖ్యంగా భూస్వా మ్య, నవా బు కుటుంబాల మరి యు సామా జిక సమస్యల నేప థ్యంలో రచనలు చేస్తూండే వారు. ఆమె మరణానికి 20యేండ్ల పూర్వమే రచనలు చేయడం ఆపే శారు. కారణం.. దురదృష్టవశా త్తు అది ‘ప్రగతిశీల రచయితల కాలం’. ఆమె ఈ కోవకు చెంది నది కాదు. ఆమె కాలంలో అస్మథ్ చుగ్తయి, ఖురతుల్ అయిన్ హైద ర్, సాదత్ హసన్ మంటు మరి యు క్రిషన్ చందర్ లాంటి ప్రగతి శీల రచయి త్రుల, రచయితల కలా న్ని తట్టు కోలేక పోయింది. కాని కొద్దికాలం గడిచాక పాఠ కులు ప్రౌఢదశకు చేరుకున్నాక ఆమె రచన లను ఇష్టపడ సాగారు. ఆమె ప్రతిరోజు కుటుంబాలలో జరిగే గొడవల మనస్తత్వ శాస్త్రాన్ని బాగా ఆకళించుకొని రాశారు. ఇలాంటి రచనలు చేసినవారు చాలా తక్కువ.
ఆమె రచన విధానం, శైలి, శిల్పం ఓ కొత్త దృక్పథంతో నడిచింది. స్త్రీ అణచివేతకు ఆమె తన కలంగళంతో పొలికేక వేశారు. అంతే గాకుండా కుండబద్దలు చేసినట్లు వాస్తవాలను పాత్రలద్వారా నడిపించారు. నవాబుల జీవితంలో స్త్రీ ఓ విలాస వస్తువు. శృంగార బొమ్మ.
న్యాయపరంగా, ఆచారవ్యవహారాల పరంగా పెండ్లాడిన భార్యలకు కొంతకాలం తర్వాత వారికి కాలం చెల్లుతుంది. వాళ్ళు ధనం, నగలు,ఆభరణాలు, వజ్ర-వైఢూర్యాల మధ్య తమ దేహాగ్నిని అణచుకోవడమే! భర్తల గురించి మిథ్యా గొప్పలను తమ ఇంటి సేవకురాళ్లతో బడాయిలు కొట్టుకోవడం తోనే కాలం వెళ్లబుచ్చే వారు. అందమైన నాజుకు ఇంటి సేవకురాళ్లతో దేహసంబంధం కలిగి ఉండేవారు. లేదా ఆడపరిచారికులే నవాబు లైన తమ భర్తలను లొంగదీసు కునేవారు! వేశ్యల జీవితవిధానం, వేశ్యల పోషణ, వారి విలాస జీవితం గురించి విశదీకరించారు. తన కథల ద్వారా, ఓ దుమారం లేపారు, ఉన్నత కుటుంబ మగ ప్రపంచంలో! ఆమె ఎన్ను కున్న కథల వస్తువులు అలాంటివి !! ఇవి కేవలం కల్పితాలే అని కొట్టి పారేయలేని వాస్త వాలు. నవాబుల రాత్రులు వినోదాలలో గడిచి పోయేవి, వారికి స్త్రీలు వినోద ఆట వస్తువులు, వేశ్యలను పోషించిన వాళ్ళు, వేశ్యతొత్తులు!
వాజిద తబస్సుం రచనలపై ఇండియాలో రెండు పిహెచ్‌డి థీసిస్‌లు రాయబడినాయి.
‘బీస్వీ సది’ ఉర్దూ మాసపత్రికలో ఆమె కథ సాహిత్యం అంకురించింది. ఆమె కథ వస్తువు ముఖ్యంగా నవాబుల చుట్టూరా తిరుగుతుంటుంది.
ప్రముఖ ఉర్దూ మాసపత్రిక ‘శమ’లో ప్రచురితమైన ఆమె కథలకు రెండువేల నుంచి పదివేల వరకు పారితోషికం అందజేసేది. ఈ రోజుల్లో దాని విలువ లక్ష రూపాయలు ప్రతి కథకు!
1970-80మధ్యకాలంలో ‘వాజిద దశ కం”.ఆమె ఉర్దూ కథాప్రపంచంలో రాజ్యమేలింది.
నవాబుల దొరతనం, విలాసమైన, శృంగార రసకేళీల రుచులతో ఉన్న హైదరా బాద్ నవాబుల జీవిత చిత్రణ ఆమె కథల ఇతివృత్తం. ఆమె కథలలో మాండలిక పదాలు జాస్తిగా ఉంటాయి. తబస్సుం గారికి ఈ నైపుణ్యం వెన్నతో పెట్టిన విద్య. పాత్రలు మనకు పరిచయస్థులుగా ఉంటాయి. ఆమె కథలోని పాత్రలు మనం ఇండ్లలోనే కాదు గల్లిలలో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. మన చుట్టూ మాట్లాడుతున్న మాండలికాల ఉచ్ఛారణలే ఆయా పాత్రల పదాలు.
తబస్సుం తనదైన ఓ ముద్ర వేసింది ఉర్దూ సాహిత్యంలో. ఆమె పాత్రల చిత్రీకరణ మన ముందు తిరుగుతున్న వ్యక్తుల్లాంటివి. తబస్సుం గారి చెప్పుకోదగిన మరికొన్ని కథలు-ప్యాసినది, సందూఖ్చి, శాదీకి రాత్, ఫూల్ ఖిల్నే దో, నథ్ కా బొఛ్, నథ్ కా గురూర్, నథ్‌కి ఇజత్, మహబత్, కైసే సం ఝావున్, మహక్ ఔర్ మహక్ వగైరా వగైర.
వివాదాస్పద కథా రచయిత్రి 07 డిసెం బర్ 2010లో ముంబాయిలో మరణించారు.