Home జాతీయ వార్తలు రేపు సాయంత్రం స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు

రేపు సాయంత్రం స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు

Vajpayee funeral of tomorrow evening

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. వాజ్‌పేయి పార్థీవ దేహాన్ని ఎయిమ్స్ నుంచి నేరుగా ఆయన నివాసానికి తరలించారు. రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌ లో  అంతిమ సంస్కారాలు జరగనున్నట్టు సమాచారం.  కాగా… శుక్రవారం ఉదయం 9 గంటలకు బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయానికి వాజ్‌పేయి పార్థీవ దేహాన్నితరలిస్తారు. రేపు మధ్యాహ్నం 1 గంట వరకు సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.