Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

నిలకడగా వాజ్‌పేయి ఆరోగ్యం:ఎయిమ్స్

vajpai

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు మంగళవారం ఎయిమ్స్ ఆస్పత్రి తెలిపింది. 93 ఏళ్ల వాజ్‌పేయి అనారోగ్యానికి గురికావడంతో సోమవారం ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించారు. మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్, కిడ్నీ తదితర సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. వాజ్‌పేయికి యాంటి బయోటిక్స్ అందిస్తున్నామని, ఇన్‌ఫెక్షన్ అదుపులోకి వచ్చే వరకు ఆయన ఆస్పత్రిలో ఉండాలని తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాజ్‌పేయికి సోమవారం డయాలసిస్ చేశారు. ఆయనను కార్డియో థోరాసిక్ సెంటర్ ఐసియులోనే మరికొంత కాలం కొనసాగించనున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆరోగ్యశాఖ మంత్రి జెడి నడ్డా, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్, విజయ్ గోయల్, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే, కేంద్ర మాజీమంత్రి కల్రాజ్ మిశ్రా, న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తదితరులు సోమవారం ఆస్పత్రిని సందర్శించారు.

Comments

comments