Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఎయిమ్స్‌లో వాజ్‌పేయికి మోడీ పరామర్శ

Vajpayee is receiving treatment in local Aids for a few days

ఆందోళనకరంగా మాజీ ప్రధాని ఆరోగ్యం

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా స్థానిక ఎయిమ్స్ లో వాజ్‌పేయి చికిత్స పొందుతున్నారు. బుధవారం ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రధాని అక్క డి వైద్యాధికారుల నుంచి వాజ్‌పేయి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. మూత్రపిండా ల సమస్య ఇతర శారీరక క్లిష్టతలతో వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరారు. ఎయిమ్స్‌కు ప్రధాని వచ్చి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం ఇది నాలుగోసారి. బుధవారం సాయంత్రం 7.15కు ఎయిమ్స్ చేరుకున్న ప్రధాని అక్కడ దా దాపు గంట సేపు ఉన్నారు. బుధవారమే కేంద్ర జవుళి మంత్రి స్మృతి ఇరానీ, బిజెపి అధ్యక్షులు అమిత్ షా ఇతర నేతలు కూడా ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థకు వచ్చి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. దేశ రాజధానిలోని పలువురు ప్ర ముఖులు బుధవారం తమ కార్యక్రమాలను రద్దు చేసుకోవడం, కొందరు హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలివెళ్లడంతో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తెలియడంతో ఎయియ్స్ పరిసర ప్రాంతాలు సందర్శకుల రాకతో కిక్కిరిసింది. జూన్ 11వ తేదీన వాజ్‌పేయి మూత్రకోశం ఇన్‌ఫెక్షన్, ఛాతీలో నొప్పి, మూత్ర పరిణామం తగ్గడం వంటి పరిణామాలతో ఇబ్బంది పడ్డారు. దీనితో ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించారు. అప్పటి నుంచి నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. 93 సంవత్సరాల వాజ్‌పేయి కి షుగర్ ఉం ది. ఆయనకు ఒకే కిడ్నీ పనిచేస్తోంది. 2009లో ఒకసారి వచ్చి న గుండెపోటుతో ఆయన శారీరక సామర్థం తగ్గిం ది. అది పూర్తి స్థాయిలో జ్ఞాపకశక్తి మందగించడానికి, వ్యక్తులను గుర్తించలేని స్థితికి దారితీసింది.

గత రెండు రోజులుగా వాజ్‌పేయి పరిస్థితి విషమంగా మారుతూ వచ్చింది. అప్పటి నుంచి ఆయనకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్ శాతం మోతాదు పెరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మంగళవారం రాత్రి నుంచి విషమం అయింది. అంతేకాకుం డా ఆయన ఛాతి, కిడ్నీలలో కూడా ఇన్‌ఫెక్షన్ సోకింది. ఆయ న ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం ని శితంగా గమనిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్ర త్త చర్యలు తీసుకొంటోంది. చికిత్స ప్రక్రియకు ఆయన స్పం దించడాన్ని బట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక నిర్థారణకు రావాల్సి ఉంటుందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.

Comments

comments