Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

చిరస్మరణీయం.. బస్సు యాత్ర

Vajpayee2

న్యూఢిల్లీ : లాహోర్‌కు వాజ్‌పేయీ చేసిన బస్సు యాత్ర భారత్ పాక్ మ ధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో దోహదపడింది. 1999లో వాజ్‌పేయీ లాహోర్‌కు బస్సులో వెళ్లి ఆనాటి పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ని ఆలింగనం చేసుకున్నారు. ఆ యాత్ర రెండు దేశాల మ ధ్య ఉద్రిక్తతలు తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయనే ఆశాభావాన్ని రేకెత్తించాయి. దీర్ఘకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ 93 ఏళ్ల వయసులో చనిపోయిన వాజ్‌పేయీ పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి దౌత్యపరంగా చెప్పుకోదగిన కృషి చేశారు.

తన బృందంతో కలిసి ఆయన లాహోర్‌కు బస్సులో వెళ్లారు. ఆయనతో పాటు బాలీవుడ్ ప్రముఖ హీరో దేవానంద్, రచయిత జావేద్ అక్తర్, క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఉన్నారు. ఈ యాత్ర పాకిస్తాన్, భారత్‌ల మధ్య సంబంధాలలో కొత్త యుగానికి నాంది పలికింది. నా దేశ ప్రజలు పాకిస్తాన్‌తో శాంతి, సామరస్యాన్ని కోరుతున్నారని లాహోర్ సమావేశంలో ఆయన చెప్పారు. దక్షిణ ఆసియా చరిత్రలో ఇది ఒక మంచి అవకాశమని, మనకు ఎదురవుతున్న సవాళ్లని ఎదుర్కోవడంలో తగిన బలం కలిగి ఉన్నామని ఆయన లాహోర్‌లో తనకు ఘనంగా ఆహ్వానం పలికినప్పుడు ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలోనే రెండు దేశాల మధ్య చరిత్రాత్మకమైన ఒప్పందం జరిగిం ది. పొరపాటుగా గాని, అనధికారికంగా అణ్వాయుధాలు ఒకరిపై ఒకరు ప్రయోగించకూడదని ఇరు దేశాలు ఒప్పందంపై సం తకాలు చేశాయి. అయితే వాజ్‌పేయీ పాకిస్తాన్ పర్యటన రెండు దేశాల మధ్య సత్‌సంబంధాలను ఎంతో కాలం నిలుపలేదు. వాజ్‌పేయీ పాక్ పర్యటన తరువాత కొద్ది నెలలకే పాక్ ఆర్మీ జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్‌లో విద్రోహ చర్యలకు పాల్పడటానికి ప్రవేశించింది. అది రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసింది.

అది కొద్ది కాలం మాత్రమే కొనసాగింది. రెండు దేశాల మ ధ్య కలహాలు రావాలని తాను కోరుకోవడం లేదని లాహోరు పర్యటనలో ఆయన చేసిన ఉపన్యాసం ఎంతగానో ఆకట్టుకుంది. అది ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ మాటలు పాకిస్తాన్ టీవీలో పదే పదే ప్రసారం చేశారు. పాక్, భారత్‌ల మధ్య సంబంధాలను పెంపొందించడంలో వాజ్‌పేయీ పర్యటన గొప్ప ముందడుగని మాజీ విదేశీ కార్యదర్శి సల్మాన్ హైదర్ అన్నారు.

Comments

comments