Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ముగిసిన వాజ్‌పేయి అంత్యక్రియలు

Vajpayee's funeral Complete ar smriti Sthal

ఢిల్లీ : భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం యమునా నది తీరంలోని స్మృతి స్థలిలో ముగిశాయి. సన్నిహితులు, అభిమానులు, బిజెపి కార్యకర్తల కన్నీటి వీడ్కోలు మధ్య అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత ఆయన చితికి నిప్పటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేశారు. వాజ్‌పేయి అంతిమ సంస్కారానికి ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, భూటాన్ రాజు వాంగ్‌చుక్ , లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీతో సహా పలువురు ప్రముఖులు స్మృతి స్థల్‌లో వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.

Vajpayee’s funeral Complete ar smriti Sthal

Comments

comments